Madhavilatha: వాళ్లు వేధిస్తున్నారని పోలీసులకు మాధవీలత ఫిర్యాదు

Actress Madhavilatha filed complaint: సినిమాలకు గుడ్ బై చెప్పి చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా హీరోయిన్ మాధవీలతకు ఇప్పుడు ఓ పెద్ద చిక్కొచ్చిపడింది. BJP మహిళా నాయకురాలిగా సమయం, సందర్భం వచ్చిన ప్రతీసారి రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్న మాధవీలత.. అందులో భాగంగానే సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా పోస్టులు పెడుతున్నారు.

Last Updated : Feb 5, 2021, 12:00 AM IST
Madhavilatha: వాళ్లు వేధిస్తున్నారని పోలీసులకు మాధవీలత ఫిర్యాదు

Actress Madhavilatha filed complaint: సినిమాలకు గుడ్ బై చెప్పి చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా హీరోయిన్ మాధవీలతకు ఇప్పుడు ఓ పెద్ద చిక్కొచ్చిపడింది. BJP మహిళా నాయకురాలిగా సమయం, సందర్భం వచ్చిన ప్రతీసారి రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్న మాధవీలత.. అందులో భాగంగానే సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా పోస్టులు పెడుతున్నారు. అయితే, మాధవీలత పెట్టే పోస్టులు ఇష్టం లేని వాళ్లు ఆమెని అదే రేంజులో ట్రోల్ చేస్తూ ఆమెను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు.

కొంతమంది నెటిజెన్స్, ఆకతాయిలు తనకు వ్యతిరేకంగా, తన పరువు-ప్రతిష్టలకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై విసుగు చెందిన Actress Madhavi Latha తాజాగా సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించి వారికి తన గోడు విన్నవించుకున్నారు. తనను వేధిస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. ఏదైనా కేసుల్లో అమ్మాయిలు, హీరోయిన్లు పట్టుబడితే.. అందులో హీరోయిన్ మాధవీలత కూడా ఉందని పేర్కొంటూ కొంతమంది దురుద్దేశపూర్వకంగా తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని నటి మాధవీలత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Also read : Sundari Trailer: అందమైన యువతికి ఇన్ని కష్టాలా ?

ప్రత్యేకించి ఏపీలో దేవాలయాలపై ( Attacks on temples in AP ) వరుసగా జరుగుతున్నదాడులను ఖండిస్తూ తాను మాట్లాడుతున్నందుకు ఇటీవల కాలంలో తనపై ఆ వేధింపులు మరీ ఎక్కువయ్యాయని Madhavilatha పోలీసుల ఎదుట వాపోయినట్టు తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News