Jeevitha: రాజశేఖర్‌ కండీషన్ చూసి భయపడ్డాం.. కానీ: జీవిత వీడియో సందేశం

Jeevitha About Rajasekhar Health Condition : ప్రముఖ నటుడు డాక్టర్ రాజశేఖర్ కుటుంబం కొన్ని రోజుల కిందట కరోనా వైరస్ బారిన పడ్డ విషయం తెలిసిందే. అందరూ కోలుకోగా.. రాజశేఖర్ ఇంకా చికిత్స పొందుతున్నారు. భర్త రాజశేఖర్ ఆరోగ్యంపై సినీ నటి జీవిత ఓ వీడియో ద్వారా స్పందించారు. మొదట్లో రాజశేఖర్ ఆరోగ్యం ఆందోళన కరంగా మారిందన్నారు.

Last Updated : Nov 4, 2020, 12:27 PM IST
Jeevitha: రాజశేఖర్‌ కండీషన్ చూసి భయపడ్డాం.. కానీ: జీవిత వీడియో సందేశం

టాలీవుడ్ ప్రముఖ నటుడు డాక్టర్ రాజశేఖర్ (Actor Rajasekhar) కుటుంబం కొన్ని రోజుల కిందట కరోనా వైరస్ బారిన పడ్డ విషయం తెలిసిందే. కుటుంబంలో అందరూ కోలుకోగా.. రాజశేఖర్ ఇంకా చికిత్స పొందుతున్నారు. భర్త రాజశేఖర్ ఆరోగ్యంపై సినీ నటి జీవిత (Jeevitha About Rajasekhar Health) ఓ వీడియో ద్వారా స్పందించారు. మొదట్లో రాజశేఖర్ ఆరోగ్యం ఆందోళన కరంగా మారిందన్నారు. ప్రస్తుతం తన భర్త చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు.

 

రాజశేఖర్ పరిస్థితి చూసి చాలా భయపడ్డామని, అయితే క్రమక్రమంగా ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని శుభవార్త చెప్పారు. హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ డాక్టర్లు నటుడికి మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతం ఆక్సిజన్ సాయం లేకుండానే రాజశేఖర్‌కు వైద్యం అందిస్తున్నారు. ఆయన తొందరలోనే కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు. 

 

 

బయట సోషల్ మీడియాలో వైరల్ అయినట్టుగా రాజశేఖర్‌ ఏ రోజు వెంటిలేటర్‌పై లేరని స్పష్టం చేశారు. అయితే ఆయన ఆరోగ్యం మొదట్లో క్రిటికల్‌గా ఉన్నది మాత్రం నిజమని చెప్పారు. సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానుల ప్రార్థనల వల్లే రాజశేఖర్ త్వరగా కోలుకుంటున్నారని, పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగొస్తారని నటి జీవిత రాజశేఖర్ ధీమా వ్యక్తం చేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News