తమిళ సినీ కుటుంబంలో రాజకీయ డ్రామా కొనసాగుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Actor Vijay) మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్థాపించే పార్టీలో తాను చేరబోవడం లేదని, తమిళనాడు రాజకీయాల్లోకి రావడం లేదని ఇటీవల తలపథి విజయ్ స్పష్టం చేశారు. తాజాగా తన అభిమాన సంఘాల నుంచి తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ మద్దతుదారులు, సానుభూతిపరులను తొలగించాలని విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడు, నిర్మాత. కొన్ని సినిమాలకు రచయితగా సైతం సేవలు అందిస్తున్నారు. ఆయన తనయుడు విజయ్ కోలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగారు. అయితే విజయ్ తండ్రి రాజకీయ పార్టీ స్థాపించనున్న నేపథ్యంలో హీరో సైతం పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే అభిమాన సంఘం ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ అధ్యక్షులతో చర్చించిన తర్వాత పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వదంతులను కొట్టిపారేశారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని తెలిపారు.
తాజాగా తన అభిమాన సంఘం ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ చెన్నై, మధురై, తిరుచ్చి జిల్లా అధ్యక్షులను బాధ్యతల నుంచి తప్పించారు. తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ మద్దతుదారులను తన అభిమాన సంఘాల నుంచి తొలగించారు. కేవలం తన మద్దతుదారులకు మాత్రమే అభిమాన సంఘంలో చోటు ఉందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు నటుడు విజయ్.
తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్థాపించబోయే పార్టీలో విజయ్ చేరకూడదని ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ మరోసారి తీర్మానించింది. తాజాగా తమిళనాడులోని అన్ని జిల్లాల అభిమాన సంఘాలతో సమావేశం తర్వాత తండ్రి మద్దతుదారులను ఫ్యాన్స్ అసోసియేషన్స్ నుంచి తొలగించడం గమనార్హం.
Adah Sharma: అందంతో ఆకట్టుకుంటున్న ఆదా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe