Actor Simbhu: ఎన్టీఆర్ తరువాత కుర్ర హీరో కోసం శింభు 'గాత్ర దానం'

Actor Simbhu Sings song for 18 Pages: తెలుగు హీరో నిఖిల్ సిద్దార్థ్ కోసం నటుడు శింబు గొంతు సవరించుకున్నారు, ఆయన 18 పేజెస్ సినిమాలో ఒక సాంగ్ పాడినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 26, 2022, 04:47 PM IST
Actor Simbhu: ఎన్టీఆర్ తరువాత కుర్ర హీరో కోసం శింభు 'గాత్ర దానం'

Actor Simbhu Sings as song for Nikhil Siddarth's 18 Pages: కార్తికేయ సినిమాతో హిట్ నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బంపర్ హిట్ అందుకున్నాడు. కేవలం తెలుగులోనే కాదు మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల సూపర్ హిట్ సాధించింది. ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న మిగతా సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం నిఖిల్ 18 పేజెస్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని సుకుమార్ రచించడం గమనార్హం. బన్నీ వాసు నిర్మాణంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద అలాగే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మీద ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిఖిల్ సిద్ధార్థ్ సరసన ఈ సినిమాలో కూడా కార్తికేయ 2 సినిమాలో నటించిన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా మీద మరింత హైప్ పెంచే ప్రయత్నాలు చేస్తుంది సినిమా యూనిట్.

అందులో భాగంగానే ఈ సినిమా కోసం తమిళ స్టార్ హీరో సూర్య ఒక సాంగ్ పాడినట్లు తెలుస్తోంది. గతంలో కూడా శింబు జూనియర్ ఎన్టీఆర్ కోసం ఒక పాట పాడారు. ఇప్పుడు మరోసారి నిఖిల్ సిద్ధార్థ కోసం ఆయన మరోసారి గొంతు సవరించుకున్నట్లుగా తెలుస్తోంది. సుకుమార్ తన కాంటాక్ట్స్ తో శింబు చేత పాట పాడించేలా చేశారని, అది సినిమాకు అదనపు ఆకర్షణ అవ్వబోతుందని తెలుస్తోంది.

ఇక నిఖిల్ సిద్ధార్థ్ పాన్ ఇండియా మార్కెట్ ను బేస్ చేసుకుని సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసేందుకు కూడా ఆలోచనలు చేస్తున్నారని, అయితే ప్రస్తుతానికి పాన్ ఇండియా ఆలోచనలో ఉన్నా దాని మీద పెద్దగా పాజిటివ్ ఒపీనియన్ అయితే అందరిలో లేదని అంటున్నారు.

ముందుగా తెలుగులో రిలీజ్ చేసి తెలుగులో మంచి హిట్ టాక్ వచ్చిన తర్వాత అప్పుడు ఇతర భాషల్లోకి రిలీజ్ చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు. ఈ ఏడాది అలా కాంతార సినిమాని మొదట కన్నడలో రిలీజ్ చేసి సూపర్ హిట్ టాక్ వచ్చిన తర్వాత ఇతర భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక లవ్ టు డే పరిస్థితి కూడా దాదాపుగా అలాగే ఉంది. అందుకే 18 పేజెస్ సినిమా విషయంలో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం అయితే జరుగుతుంది. 

Also Read: SSMB 28: అదిరిందయ్యా త్రివిక్రమ్.. మహేష్ బాబు సినిమా కోసం ఏకంగా 4 హీరోయిన్లు!

Also Read: Love Today Day 1 Collections : అల్లరి నరేష్‌ను తొక్కి అవతల పారేసిన తమిళ డబ్బింగ్ సినిమా.. లవ్ టుడేకు దిమ్మ తిరిగే కలెక్షన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News