Chandra Mohan Death News: సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు కన్ను మూశారు. ఆయన వయస్సు 82 ఏళ్ళు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయి. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా చంద్ర మోహన్ తో ఉన్న తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
కృష్ణా జిల్లా పమిడిముక్కలలో చంద్రమోహన్ జన్మించారు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. చంద్రమోహన్ భార్య జలంధర్ రచయిత్రి. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు మధుర మీనాక్షి, మాధవి ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో పనిచేస్తుండగా.. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్యురాలిగా సేవలు అందిస్తున్నారు.
కృష్ణా జిల్లా పమిడిముక్కలలో చంద్రమోహన్ జన్మించారు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. 1966లో రంగుల రాట్నం చిత్రంతో తెరగేట్రం చేశారు. తన తొలి చిత్రానికే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. రెండు ఫిలింఫేర్, 6 నంది అవార్డులు అందుకున్న చంద్రమోహన్.. అనేక చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ నటించారు. ఫస్ట్ మూవీ పదహారేళ్ల వయసుతోపాటు సిరిసిరి మువ్వ సినిమాలకు ఆయన ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. 1987లో చందమామ రావే సినిమాకు.. కళ్యాణ్ రామ్ అతనొక్కడే సినిమాలో సహాయ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. చంద్రమోహన్ తన 55 ఏళ్ల సినీ కెరీర్‌లో 932 సినిమాలలో యాక్ట్ చేశారు. తెలుగుతోపాటు పలు తమిళ సినిమాల్లోనూ ఆయన నటించారు.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook