1134 Movie Trailer: ఏటీఎం రాబరీ నేపథ్యంతో వస్తోన్న నో బడ్జెట్‌ సినిమా '1134'

1134 Telugu Movie Trailer: 2 నిమిషాల 28 సెకన్ల నిడివితో ఆద్యంతం ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగిపోయేలా ఈ ట్రైలర్‌ని కట్ చేశారు. ATM సెంటర్స్‌లో చోరీలు చేస్తున్న ముగ్గురు వ్యక్తుల కథను ఎంతో వైవిధ్యభరితంగా మలిచారని ఈ ట్రైలర్ చూస్తోంటే అర్థమవుతోంది. భారీ డైలాగ్స్ జోలికి పోకుండా కేవలం థ్రిల్లింగ్ సన్నివేశాలతోనే సినిమాపై అంచనాలు పెంచేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 8, 2023, 10:06 PM IST
1134 Movie Trailer: ఏటీఎం రాబరీ నేపథ్యంతో వస్తోన్న నో బడ్జెట్‌ సినిమా '1134'

1134 Telugu Movie Trailer: కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాగా వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘1134’ మూవీ. డిఫరెంట్ టైటిల్‌తో థ్రిల్లింగ్ ప్రధానంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు నూతన దర్శకుడు శరత్ చంద్ర తడిమేటి. రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో ఈ సినిమా సాగనుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా.. తాజాగా ఈ చిత్ర నిర్మాతలు ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు.

2 నిమిషాల 28 సెకన్ల నిడివితో ఆద్యంతం ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగిపోయేలా ఈ ట్రైలర్‌ని కట్ చేశారు. ATM సెంటర్స్‌లో చోరీలు చేస్తున్న ముగ్గురు వ్యక్తుల కథను ఎంతో వైవిధ్యభరితంగా మలిచారని ఈ ట్రైలర్ చూస్తోంటే అర్థమవుతోంది. భారీ డైలాగ్స్ జోలికి పోకుండా కేవలం థ్రిల్లింగ్ సన్నివేశాలతోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. ట్రైలర్ చివరలో 'అన్నీ నువ్వనుకునేలా జరిగితే మరి నేనెందుకురా ఇక్కడ' అంటూ వచ్చిన డైలాగ్.. ఈ సినిమాలో ఏదో కొత్త కోణం చూపించబోతున్నారని స్పష్టం చేస్తోంది.         

సొంతంగా తనే కథ రాసుకొని హై టెక్నికల్ వాల్యూస్‌తో అన్నివర్గాల ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ శరత్ చంద్ర తడిమేటి. ప్రతి సన్నివేశం కూడా ఎంతో థ్రిల్ చేసేలా షూట్ చేశారు. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌ వేగవంతం చేశారు.         

1134-Telugu-Movie-Trailer.jpg

నందు మాట్లాడుతూ.. ‘నేను శరత్ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. ఫ్రెండ్‌షిప్ డే నాడు ఇలా రావడం నాకు ఆనందంగా ఉంది. ఈ రోజు నేను ఇక్కడకు రావడానికి కారణం మా స్నేహబంధమే. ఉడతా భక్తిలా నేను కూడా ఈ సినిమాకు ఏమైనా చేయాలని అనుకుని వచ్చాను. మాకు తరుణ్ భాస్కర్, అడివి శేష్ కుల దైవం వంటి వారు. వాళ్లే ఈ జీరో బడ్జెట్ చిత్రాలను ప్రారంభించారు. క్షణం, పెళ్లి చూపులు అలానే మొదలయ్యాయి. ఎంత బడ్జెట్‌తో సినిమాను తీశామని కాదు.. కంటెంట్ ఉందా? లేదా? అన్నది ముఖ్యం. ఆ నమ్మకంతోనే శరత్ ఈ సినిమాను తీశాడు. నో బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News