నిమజ్జనం విషయంలో మమతా బెనర్జీకి హైకోర్టు షాక్

.

Last Updated : Sep 30, 2017, 12:43 PM IST
నిమజ్జనం విషయంలో మమతా బెనర్జీకి హైకోర్టు షాక్

కోల్ కతా: పశ్చిమ బెంగాల్  ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు ఊహించని రీతిలో షాకిచ్చింది. నవరాత్రుల సందర్బంగా  దేవి విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి సర్కారు  జారీచేసిన  ఉత్తర్వులను కోర్టు వాపసు తీసుకోవాలని ఆదేశించింది. అక్టోబర్‌ 1వ తేదీన ముస్లిముల పర్వదినం  మొహర్రం సందర్భంగా దేవి విగ్రహాలను సెప్టెంబర్‌ 30 రాత్రి 10 గంటల వరకే నిమజ్జనం చేయాలని.. మిగిలినవి అక్టోబర్‌ 2న నిమజ్జనం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా...  దీన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన మూడువ్యాజ్యాలపై  హైకోర్టు విచారణ చేపట్టింది.

ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ... అన్ని రోజుల్లోనూ దేవీ  విగ్రహాలు నిమజ్జనం చేసుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌ తివారీ, న్యాయమూర్తి హరీశ్‌ టాండన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. అయితే  దేవీ ఉత్సవ ఊరేగింపులు , మొహర్రం వూరేగింపులకు వేర్వేరు మార్గాలను కేటాయించాలని పోలీసులకు సూచించింది. కాగా ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని మమతా సర్కార్ భావిస్తోంది.

Trending News