Ayodhya: అయోధ్య రామ మందిరం ప్రారంభమయ్యాక తొలిసారి విషాద సంఘటన చోటుచేసుకుంది. మందిరం సమీపంలోని సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వెళ్లిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు. నీటిలో మునిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో అయోధ్యలో విషాద వాతావరణం అలుముకుంది. మృతులు నిండా ఇరవై యేళ్లు కూడా లేకపోవడం గమనార్హం. పుత్ర శోకంతో ఆయా కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read: Woman Killed: ఆస్ట్రేలియాలో తెలంగాణ మహిళ దారుణ హత్య.. సంచలనం రేపుతున్న భర్త వ్యవహారం
అయోధ్య బాల రాముడిని దర్శించుకునేందుకు ఆదివారం సెలవు రోజు కావడంతో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన రవి మిశ్రా (20), హర్షిత్ అవస్థి (18), ప్రియాంషు సింగ్ (16) అయోధ్యకు వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి మునిగారు. అయితే నది లోపలి భాగంలోకి వెళ్లడంతో నీటి ఉధృతికి ఆ యువకులు తట్టుకోలేకపోయారు. నీటి మునిగిపోయారు. ఆ యువకులు నీటి మునిగిపోతుండడంతో స్థానికులు స్పందించి వెంటనే కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో యువకులు విగతజీవులుగా లభించారు.
Also Read: Sad Incident: అయ్యో ఎంత ఘోరం.. దేవుడి ఊరేగింపులో బాణాసంచా మీద పడి బాలిక మృతి
సరయూ నదిలో నీటి ఉదృతి అధికంగా ఉండడమే కాకుండా యువకులకు ఈత రాకపోవడం ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషాద వార్త తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయోధ్యలో దర్శనం కోసం వెళ్లి విగతజీవులుగా మారిన తమ పిల్లలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా అయోధ్య ఆలయం పునఃప్రారంభం కావడంతో సరయూ నది వద్ద భక్తుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter