Shraddha Murder Case Update: శ్రద్ధా హత్య కేసులో కీలక పరిణామం.. కోర్టులో అఫ్తాబ్ ఏం చెప్పాడంటే..!

Aftab Amin Poonawalla confession: శ్రద్ధా హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్‌ను ఢిల్లీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. మరో నాలుగు రోజులు పోలీసు కస్టడీని కోర్టు మరో నాలుగు రోజులు పొడగించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2022, 12:40 PM IST
Shraddha Murder Case Update: శ్రద్ధా హత్య కేసులో కీలక పరిణామం.. కోర్టులో అఫ్తాబ్ ఏం చెప్పాడంటే..!

Aftab Amin Poonawalla confession: ముంబైకి చెందిన శ్రద్ధా హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. కోర్టులో అఫ్తాబ్‌ను పోలీసులు హాజరుపర్చగా.. శ్రద్ధాను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికినట్లు జడ్జి ముందు చెప్పాడు. ఢిల్లీ కోర్టు అఫ్తాబ్ పోలీసు కస్టడీని మరో 4 రోజుల పాటు పొడిగించింది.

మైదంగర్హి చెరువులో గాలింపు..

ఢిల్లీలోని మైదాన్‌గర్హి చెరువులో కీలక సాక్ష్యాధారాలు లభించాయి. డైవర్ల సహాయంతో పోలీసులు కొన్ని ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఈ ఎముకలు మనిషి చేతికి చెందినవని పోలీసులు గుర్తించారు. విచారణ నిమిత్తం ఎముకలన్నింటినీ సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు. పోలీసులు ఇంకా తలను ఇంకా కనిపెట్టలేదు. తల దిగువ భాగం దవడ మాత్రమే లభించింది. ఇది ఇప్పటికే దర్యాప్తు కోసం సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. తల కూడా ఇదే చెరువులో ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. చెరువులో నిరంతరం గాలిస్తున్నారు.

రాబోయే 100 గంటలు కీలకం

నిందితుడు అఫ్తాబ్‌ను కోర్టులో హాజరుపరచగా.. కోర్టు రిమాండ్‌ను 4 రోజుల పాటు పొడిగించింది. ఈ కేసు దర్యాప్తు కోసం రాబోయే 100 గంటలు చాలా కీలకంగా మారనున్నాయి. పోలీసులు అనేక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు రెడీ అవుతున్నారు. పోలీసులు అఫ్తాబ్‌ను ఇప్పటికే 10 రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఏదైనా కేసులో నిందితుడిని జైలుకు పంపే ముందు.. నిందితుడిని 14 రోజుల పాటు పోలీసు కస్టడీకి తీసుకోవచ్చు. పది రోజులు పూర్తి కావడంతో మరో 4 రోజుల కస్టడీని కోర్టు పొడగించింది. 

ఈ కేపులో పోలీసులకు పలు కీలక ఆధారాలు లభించాల్సి ఉంది. ఇప్పటివరకు ఘటనకు ఉపయోగించిన ఆయుధం లభ్యం కాలేదు. ఇది కాకుండా శ్రద్ధా తలలో కొంత భాగం దొరకలేదు. శరీరంలోని మరికొన్ని ముఖ్యమైన భాగాలు కూడా ఎక్కడు ఉన్నాయో తెలియడం లేదు. హత్య సమయంలో దుస్తులు కూడా కనిపించకపోవడంతో పోలీసులు శ్రద్ధా ఫోన్ కోసం వెతుకుతున్నారు.

నార్కో పరీక్ష నిర్వహించే ముందు నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు పాలిగ్రఫీ పరీక్ష నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులు కోర్టు నుంచి అనుమతి పొందారు. మరో నాలుగు రోజుల్లో పోలీసులు అఫ్తాబ్ పాలిగ్రఫీ టెస్ట్, నార్కో టెస్ట్‌లు కూడా చేయనున్నారు.

ముంబైకి చెందిన శ్రద్ధా, అఫ్తాబ్‌ల ప్రేమ డేటింగ్ యాప్‌లో కలుసుకున్న తర్వాత మొదలైంది. ఆ తరువాత వారిద్దరూ లివ్ ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ముంబైలో ఇద్దరు కలిసి కొద్దిరోజులు ఉన్నారు. కొన్ని నెలలు ముంబైలో ఉంటున్న శ్రద్ధా, అఫ్తాబ్ తరువాత ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. శ్రద్ధా, అఫ్తాబ్‌లు ఈ ఏడాది మే 8న ఢిల్లీకి వచ్చి ఛతర్‌పూర్‌ ప్రాంతంలో ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత మే 18న ఇద్దరి మధ్య గొడవ జరిగి.. ఆవేశంలో అఫ్తాబ్ శ్రద్ధాను హత్య చేశాడు. హత్య అనంతరం అఫ్తాబ్ శ్రద్ధా మృతదేహంలోని 35 ముక్కలను ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో విసిరాడు.

Also Read: Satyendra Jain Massage: మంత్రికి మసాజ్ చేసిన ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే షాక్.. ఆ వీడియోలో కీలక మలుపు

Also Read: 7th Pay Commission: కొత్త ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగులకు ట్రిపుల్ బొనంజా.. కీలక నిర్ణయాల దిశగా కేంద్రం..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి a

Trending News