Police Claims Enough Evidence To Convict Aftab in Shraddha Murder Case: దేశ రాజధాని ఢిల్లీతో సహా యావత్ దేశాన్ని షాక్ కు గురి చేసిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ మెడకు పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. అఫ్తాబ్‌కు కఠిన శిక్ష పడేలా తగిన ఆధారాలు సేకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. తాజాగా పోలీసులు అఫ్తాబ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు కానీ ఆ నివేదిక ఇంకా రావాల్సి ఉంది. మరోవైపు గురువారం రోహిణిలోని డాక్టర్ భీంరావు అంబేద్కర్ ఆస్పత్రిలో నిందితుడు అఫ్తాబ్కు నార్కో టెస్ట్ నిర్వహించారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభమైన నార్కో పరీక్ష దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు, నిపుణుల సమక్షంలో జరిగిన పరీక్షలో అఫ్తాబ్‌ను పలు ప్రశ్నలు, సమాధానాలు అడిగారు. ఈ సమయంలో 50కి పైగా ప్రశ్నలు అడిగారని, అందులో శ్రద్ధ హత్య, ఆమె మృతదేహం ఆచూకీ సహా అనేక రహస్యాలను వెలికితీసే ప్రయత్నం జరిగిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే నార్కో పరీక్ష పూర్తిగా విజయవంతమైందని ఎఫ్‌ఎస్‌ఎల్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు పరీక్ష నివేదిక తయారు చేసి సీల్డ్ కవర్ లో కోర్టు ముందు సమర్పించనున్నారు. అఫ్తాబ్‌ను వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్ అనంతరం మధ్యాహ్నం తిరిగి తీహార్ జైలుకు తరలించారు.
ఇక షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం అఫ్తాబ్ ను తీహార్ జైలు నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అంబేద్కర్ ఆసుపత్రికి తీసుకు వచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నార్కో నోడల్ అధికారి డాక్టర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మత్తు వైద్యుడు అఫ్తాబ్ కు మందు ఇచ్చారు. ఈ సమయంలో, ఆరు నుండి ఏడుగురు ఫోరెన్సిక్ నిపుణులతో పాటు, అంబేద్కర్ ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం మరియు ఫోటో నిపుణులు కూడా అక్కడే ఉన్నారు. ఈ సమయంలో, ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ అఫ్తాబ్‌ను ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు అడగడం ప్రారంభి అఫ్తాబ్‌ను 50కి పైగా ప్రశ్నలు అడిగారని, ఆ తర్వాత చాలా ముఖ్యమైన రహస్యాలు బయటపడ్డాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
గాఢనిద్రలో ఉన్న అఫ్తాబ్‌ని పదే పదే చప్పుడుతో నిద్రలేపి ప్రశ్నలకు సమాధానం చెప్పమని అడగడం అతను తన మనసులో ఉన్నవన్నీ కక్కేశాడని అంటున్నారు. నార్కో టెస్ట్‌లో అఫ్తాబ్ ఏ ప్రశ్నలకు సమాధానమిచ్చాడు మరియు ఏ రహస్యాలు బయటపడ్డాయి అనే విషయాలను మాత్రం పోలీసులు బయటపెట్టడం లేదు. ఈ ప్రక్రియ అంతా చాలా గోప్యంగా ఉంచినట్లు చెబుతున్నారు. ఈ టెస్టు ఆధారంగా ఒక నివేదిక తయారు చేసి కోర్టులో సమర్పించాల్సి ఉంది. దాని ఆధారంగానే కోర్టు చర్యలు తీసుకుంటుందని అంటున్నారు.
మరోపక్క ఈ కేసును విచారిస్తున్న సిట్ ఇప్పటివరకు మెహ్రౌలీ, గురుగ్రామ్ అడవుల్లో శ్రద్ధకు చెందిన 25 నుంచి 30 ఎముకలను గుర్తించింది. ఇందులో దవడ ఎముక కూడా ఉంది. ఈ ఎముకలన్నింటినీ విచారణ నిమిత్తం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు. పోలీసు బృందం ఇప్పటివరకు 50 మందికి పైగా వాంగ్మూలాలను నమోదు చేసింది. ఇందులో శ్రద్ధా స్నేహితులు, అఫ్తాబ్ స్నేహితులు, ఇద్దరి కామన్ ఫ్రెండ్ కాకుండా ఇద్దరి బంధువులు కూడా ఉన్నారు. ఒక్కొక్కరి వాంగ్మూలాలను నమోదు చేస్తూ ఈ కేసులో ఆధారాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Also Read: Nagole Gold Theft Case: నాగోలులో కాల్పులు, బంగారం చోరీ ఘటనలో ఇద్దరికి గాయాలు
Also Read: Drishyam Scenes: దృశ్యం సినిమా రిపీట్.. లవర్తో కలిసి భర్తను ఇంట్లోనే పూడ్చిన భార్య!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook