NIA Investigation in PFI Case: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో ఎన్ఐఏ విచారణ కొనసాగుతోంది. మత విద్వేషాలు రేపి, విధ్వంసం సృష్టించే కుట్రకు పాల్పడుతున్నారనే అభియోగాల కింద బోధన్‌కి చెందిన సమీర్, ఆదిలాబాద్‌కి చెందిన ఫిరోజ్, జగిత్యాలకు చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ అహమ్మద్, నెల్లూరు బుజ్జిరెడ్డిపాళ్యంకి చెందిన ఇలియాస్ అనే నలుగురిని అరెస్ట్ చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు.. వారిని కోర్టులో హాజరుపర్చారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. నోటీసులు అందుకున్న 9 మంది విచారణకు హాజరయ్యారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో ఆరా తీసిన తర్వాతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు అనుమానితులను అదుపులోకి తీసుకుని రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.
నిషేధిత సంస్థ సిమితో (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా) పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కలిసి పని చేస్తున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వద్ద సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేషనల్ చైర్మన్ అబ్దుల్ రెహ్మాన్ గతంలో స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కి జాతీయ కార్యదర్శిగా వ్యవహరించడం వీరి అనుమానాలకు ఒక కారణం కాగా.. పీఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న అబ్ధుల్ హమీద్.. గతంలో సిమికి రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించడం మరో కారణమైంది. పీఎఫ్ఐ, సిమీ సంస్థల మధ్య ఉన్న ఈ లింక్స్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులకు ఉన్న అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది.
ఎన్ఐఏ సోదాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆర్థిక లావాదేవీలు, నిధుల సేకరణ వివరాలు, బ్యాంక్ ఖాతాలు, డైరీలు, బుక్స్ స్వాధీనం చేసుకున్న అధికారులు.. వారితో సంబంధాలు కలిగి ఉండి, వారికి సహకరిస్తున్న వారి వివరాలు కూడా రాబడుతున్నట్టు సమాచారం. సిమి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్టుగా భావిస్తున్న అనుమానితుల నుంచి హార్డ్ డిస్క్, లాప్ టాప్,ప్లెక్సీ, మారణాయుధాలు, లాఠీలు, నాన్‌చాక్‌లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుల వద్ద స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్, ఇతర హార్డ్ డిస్కుల్లో ఉన్న డేటాను క్రోడీకరిస్తే.. మరింత సమాచారం రాబట్టవచ్చని భావిస్తున్న పోలీసులు.. ప్రస్తుతం అదే పనిలో నిమగ్నమయ్యారు.
Also Read : Khammam: లిఫ్ట్ పేరుతో ఇంజెక్షన్ దాడి..ఖమ్మం జిల్లాలో దారుణం..!
Also Read : Crime News: బామ్మర్దిపై ఉన్న కోపంతో అతడి భార్యపై.. అతి కిరాతకంగా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి