Betting: బెట్టింగ్‌లకు రూ.15 కోట్ల అప్పు.. మోసం చేసి విదేశాలకు పారిపోతుంటే అడ్డంగా దొరికిన మిషన్‌ భగీరథ ఏఈ

Mission Bhagiratha AE Debts For Betting: మంచి ఉద్యోగం.. మంచి కుటుంబం ఉన్నా కూడా అతడు బెట్టింగ్‌కు పాల్పడి జైలు పాలయ్యాడు. రూ.15 కోట్ల అప్పు చేసి విదేశాలకు పారిపోతూ పోలీసులకు చిక్కాడు. ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 12, 2024, 11:38 AM IST
Betting: బెట్టింగ్‌లకు రూ.15 కోట్ల అప్పు.. మోసం చేసి విదేశాలకు పారిపోతుంటే అడ్డంగా దొరికిన మిషన్‌ భగీరథ ఏఈ

Bhagiratha AE Arrest: సరదాకు మొదలయ్యే బెట్టింగ్‌ అనంతరం అలవాటుగా మారి దారుణాలకు దారి తీస్తుంది. బెట్టింగ్‌ నుంచి బయటకు రాలేక ప్రాణాలు కోల్పోవడం.. లేదా విదేశాలకు పారిపోవడం జరుగుతోంది. అలా బెట్టింగ్‌ వ్యసనంగా మార్చుకున్న మిషన్‌ భగీరథ ఏఈ ఏకంగా రూ.15 కోట్ల అప్పు చేశాడు. బెట్టింగ్‌లకు డబ్బులు లేక కాంట్రాక్టర్లను నమ్మించి డబ్బులు దండుకుని మోసం చేశాడు. ఎంతకీ డబ్బులు ఇవ్వడం లేదు. దీనికి తోడు కొన్నాళ్లు అజ్ఞాతంలో మునిగాడు. చివరకు విదేశాలకు పారిపోతుండగా పోలీసులు పట్టుకోవడంతో అతడి లీలలు బయటకు వచ్చాయి. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. నిందితుడు మాత్రం ఢిల్లీలో దొరికాడు.

Also Read: Chungreng Koren: 'మణిపూర్‌ మంటల్లో కాలుతుంది మోదీజీ ఒక్కసారి రండి' కన్నీళ్లతో చాంపియన్‌ విజ్ఞప్తి

మేడ్చల్‌ జిల్లా కీసర మండలం మిషన్‌ భగీరథ ఏఈగా రాహుల్‌ పని చేస్తున్నాడు. అతడి భార్య, తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. సంపాదనకు ఎలాంటి లోటు లేదు. కానీ రాహుల్‌ ఆన్‌లైన్‌ గేమ్స్‌, రమ్మీ వంటి వివిధ బెట్టింగ్‌ గేమ్స్‌కు అలవాటు పడ్డాడు. ఎంతలా అంటే బెట్టింగ్‌ కోసం తన ఉద్యోగాన్ని కూడా తాకట్టు పెట్టేలా చేస్తున్నాడు. బెట్టింగ్‌ కోసం డబ్బులు లేక కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తీసుకున్నాడు. తీసుకున్న డబ్బున్నంతా బెట్టింగ్‌ గేమ్స్‌లో పెట్టి తీవ్రంగా నష్టపోయాడు.

Also Read: Sad Incident: అయ్యో ఎంత ఘోరం.. దేవుడి ఊరేగింపులో బాణాసంచా మీద పడి బాలిక మృతి

దాదాపు 37 మంది నుంచి సుమారు రూ.15 కోట్లకు పైగా రాహుల్‌ అప్పులు చేశాడు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు, ఇతరులు రాహుల్‌పై ఒత్తిడి చేశారు. ఇక డబ్బులు ఇవ్వలేక కాంట్రాక్ట్‌లు ఇప్పిస్తానని నమ్మబలికాడు. అటు కాంట్రాక్ట్‌లు ఇవ్వక.. డబ్బులు ఇవ్వకపోవడంతో వారు సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. మోసాలకు పాల్పడుతున్న రాహుల్‌ను ఆరు నెలల కిందట సస్పెండ్‌ చేశారు. అయితే రాహుల్‌కు సహకరించిన మరో అధికారిని కూడా సస్పెండ్‌ చేశారు.

సస్పెండ్‌ అయిన అనంతరం రాహుల్‌ అజ్ఞాతంలోకి వెళ్లాడు. కొన్ని నెలలుగా పరారీలో ఉన్నాడు. దీంతో అతడిపై కాంట్రాక్టర్లు, డబ్బులు ఇచ్చినవారు కీసర పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అతడిపై లుక్‌ ఔట్‌ నోటీసు జారీ చేశారు. అయితే రాహుల్‌ సోమవారం విదేశాలకు పారిపోతున్న క్రమంలో ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులు అతడిని రాత్రి కీసరకు తీసుకువచ్చి విచారణ చేపట్టారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News