Shamful Incident: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఒక చోట పరీక్ష రాయడానికి వెళ్లిన విద్యార్థి పరీక్ష హాల్‌లో స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే అధికారులు, ఉపాధ్యాయులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించగా బాలిక గర్భవతి అని తేలడంతో నిర్ఘాంతపోయారు. ఉపాధ్యాయులు కూడా షాక్‌లో మునిగారు. విచారణ చేయగా గ్రామస్తులు పంచాయితీ పెట్టారు. అయితే ఆ పంచాయితీలో గ్రామస్తులు ఆ బాలిక గర్భానికి రూ.2 లక్షలు ఖరీదు కట్టారు. అయితే బాలికపై అఘాయిత్యానికి పాల్పడింది కూడా తోటి విద్యార్థే అనే తేలింది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగి పోలీసులకు ఫిర్యాదు చేసి బాలికను ఆస్ప్రతికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Jalahalli Incident: బూతు పనులకు అడ్డాగా మెట్రో స్టేషన్లు.. మహిళ ముందు ఉద్యోగి 'పాడు పని'
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. ఇటీవల ప్రారంభమైన పరీక్షలు రాసేందుకు సుజాతనగర్‌కు వెళ్లింది. ఈనెల 18వ తేదీన పరీక్షకు వెళ్లగా అక్కడే కళ్లు తిరిగిపడిపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా గర్భవతి అని తేలింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి చేరుకుని రహాస్యంగా బాలికను ఇంటికి తీసుకెళ్లారు. వివరాలు ఆరా తీయగా గ్రామానికి చెందిన ఓ విద్యార్థి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపింది. వెంటనే బాలుడి కుటుంబంపై గ్రామ పెద్దలతో పంచాయితీ పెట్టించారు. అయితే ఆ పంచాయితీ పెద్దలు బాలిక గర్భానికి వెల కట్టారు.
Also Read: Ice Cream Semen: ఛీ.. ఛీ.. నడిరోడ్డుపై 'ఆ పని' కానిచ్చేసి ఐస్‌క్రీమ్‌లో వీర్యం కలిపిన యువకుడు
బాలుడి కుటుంబం రూ.2 లక్షలు చెల్లించాలని గ్రామ పెద్దలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. తమకు న్యాయం జరగకపోవడంతో బాలిక కుటుంబసభ్యులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టి అఘాయిత్యానికి పాల్పడిన బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నేరానికి పాల్పడిన బాలుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తీర్పునిచ్చిన గ్రామ పెద్దలకు పోలీసులు కౌన్సెలిగ్ నిర్వహించారు. బాలికను ఐసీడీఎస్ అధికారులు వెంట తీసుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter