Siddipet Fire Accident: వేసవికాలం ప్రారంభమవుతోంది.. ఇప్పటికే ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ సమయంలో సిద్దిపేటలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్టేషన్ మొత్తం అగ్నికీలల్లో చిక్కుకుంది. వెంటనే సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదింపులు చేస్తూ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రితో ఫోన్‌లో కూడా మాట్లాడారు.
Also Read: Keeda Kola: కీడా కోలాకు 'ఏఐ' దెబ్బ.. ఎస్పీబీ వాయిస్ వాడుకున్నందుకు రూ.కోటి చెల్లించాల్సిందే
సిద్దిపేట పట్టణంలోని 220 kv సబ్ స్టేషన్‌లో బుధవారం రాత్రి దాదాపు 9 గంటల సమయంలో పీటీర్ పేలి మంటలు వ్యాపించాయి. భారీగా చెలరేగిన మంటలు స్టేషన్ మొత్తం వ్యాపించాయి. ఈ సంఘటన విషయం తెలుసుకున్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క్‌తో ఫోన్‌లో హరీశ్ రావు సమాచారం అందించారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.
Also Read: Marriage Turns To Tragedy: తాళి కట్టి వారం కాకముందే.. ఎస్సైతో సహా నవ వరుడు దుర్మరణం
ప్రమాదం నేపథ్యంలో మంటలను అదుపు చేయడానికి స్థానిక అగ్నిమాపక సిబ్బందితోపాటు గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ ఫైర్ స్టేషన్‌కు సంబంధించిన వాహనాలు కూడా వచ్చాయి. మూడు ఫైర్ ఇంజన్లను రప్పించి మంటలను అదుపులోకి తీసుకున్నారు. కాగా భారీ ప్రమాదం జరగడంతో సిద్దిపేట నియోజకవర్గమంతా అంధకారంలో మునిగింది. సిద్ధిపేట పట్టణంతో పాటు 5 మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ప్రమాదానికి కారణం?
సిద్దిపేట 220kv సబ్ స్టేషన్ పీటీర్ పేలడం వెనుక కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు. సంఘటన జరగడానికి గల కారణాలను స్టేషన్ సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నారు. డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరాలో సప్లయ్ లేదని.. ఈ ఒత్తిడి కారణంగా ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదంతో భారీగా నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంతో వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టి సత్వరమే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పని చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఆ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి