Rape on Cow: గర్భంతో ఉన్న ఆవుపై అర్ధరాత్రి యువకుడి లైంగిక దాడి... చనిపోయిన ఆవు.. నిందితుడి అరెస్ట్..

West BengalMan Rapes Cow: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు గర్భంతో ఉన్న ఆవుపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన బెంగాల్‌లో చోటు చేసుకుంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 31, 2022, 03:20 PM IST
  • పశ్చిమ బెంగాల్‌లో షాకింగ్ ఘటన
  • గర్భంతో ఉన్న ఆవుపై యువకుడి అత్యాచారం
  • అర్ధరాత్రి పశువుల కొట్టంలోకి దూరం
 Rape on Cow: గర్భంతో ఉన్న ఆవుపై అర్ధరాత్రి యువకుడి లైంగిక దాడి... చనిపోయిన ఆవు.. నిందితుడి అరెస్ట్..

West Bengal Man Rapes Cow: పశ్చిమ బెంగాల్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ కామాంధుడు గర్భంతో ఉన్న ఆవుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ ఆవు మృతి చెందింది. చనిపోయిన ఆవు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... సౌత్ 24 పరగణాలు  జిల్లాలోని నార్త్ చాందన్‌పిడి గ్రామానికి చెందిన ఆర్తి భుయా కుటుంబం పశువులను పెంచుతోంది. పశువుల కోసం ఇంటి పక్కనే కొట్టం ఏర్పాటు చేశారు. ఆర్తి భుయా పొరిగింటి వ్యక్తి ప్రద్యుత్ (29) ఇటీవల ఓరోజు అర్ధరాత్రి పశువుల కొట్టంలోకి చొరబడ్డాడు. కొట్టంలో కట్టేసి ఉన్న ఆవుల్లో ఒకదానిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ ఆవుకు తీవ్ర రక్తస్రావమై మృతి చెందింది.

ఈ ఘటనపై ఆర్తి భుయా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నిందితుడు ప్రద్యుత్‌పై ఐపీసీ సెక్షన్ 377 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి 14 రోజులు రిమాండ్ విధించింది. నిందితుడికి గతంలోనూ నేర చరిత ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో మేకలు, వాహనాలు, పొలాల్లో కూరగాయలు ఎత్తుకెళ్లినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నట్లు గుర్తించారు. కాగా, కొద్ది నెలల క్రితం తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నిర్మల్‌లో ఓ ఇంటి నిర్మాణ పనుల నిమిత్తం యూపీ నుంచి ఓ కూలీ పెరట్లో కట్టేసిన ఆవును గదిలోకి తీసుకెళ్లి బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. 

Also Read: Asia Cup 2022: టీమిండియా తదుపరి కెప్టెన్‌ హార్దిక్ పాండ్యానే..భారత మాజీ ప్లేయర్ జోస్యం..!

Also Read: Ganesh Chaturthi 2022: బొజ్జ గణపయ్యకు అత్యంత ఇష్టమైన 5 పదార్థాలివే.. ఇవి నైవేద్యంగా పెడితే గణనాథుడి అనుగ్రహం తప్పక పొందుతారు..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News