Union Budget Expectations: ప్రజలంతా కేంద్ర బడ్జెట్ గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమకు బడ్జెట్లో ఏమైనా ప్రయోజనం కలుగుతుందా అని వేచి చూస్తున్నారు. ముఖ్యంగా బడ్జెట్లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపైనే దృష్టి ఉంటుంది. గ్యాడ్జెట్ల ధరలు ఏమైనా తగ్గుతాయా? అని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. బడ్జెట్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై దిగుమతి సుంకం ఏమైనా తగ్గుతుందా.. రాయితీలు ఏమైనా లభిస్తాయా? అని టెక్ ప్రియులు లెక్కలు వేసుకుంటున్నారు.
Also Read: Shamshabad Airport: ఎంతైనా డబ్బులిస్తామయ్యా ఫ్లైట్ ఎక్కించు.. శంషాబాద్‌లో ప్రయాణికుల గొడవ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. జూలై 23వ తేదీ మంగళవారం రోజున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సీతారామన్ ప్రవేశపెడుతున్న బడ్జెట్లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఎలాంటి శుభవార్త ఉంటుందా? అని టెక్ రంగం ఎదురుచూస్తోంది. అయితే ఈ బడ్జెట్లో ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్ల దిగుమతి సుంకం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. వాటిలోనే స్మార్ట్ఫోన్లకు సంబంధించి కూడా ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. స్మార్ట్ఫోన్లు విలాసవంతమైన వస్తువుల్లో ఒకటిగా నిలుస్తున్నాయి. ఇప్పుడు మానవుడి జీవితంలో ఫోన్లు, ట్యాబ్లెట్లు ఒక భాగమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏమైనా వాటి ధరలు తగ్గుతాయా? అని ముఖ్యంగా యువత ఎదురుచూస్తోంది.
Also Read: Windows Outage: ఒక్క సమస్యతో ప్రపంచం అతలాకుతలం.. స్తంభించిన ఎయిర్‌లైన్స్, బ్యాంకింగ్, టెలికాం
గత బడ్జెట్ 2023-2024లో తక్కువ ధరలకు ఫోన్లను తయారుచేయడంలో కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం సుంకాలు తగ్గించింది. దేశంలో ఫోన్ల తయారీని ప్రోత్సహించడానికి కేంద్రం రాయితీ ఇచ్చిన విషయం తెలిసిందే. కెమెరా లెన్స్‌లపై వంటి వస్తువులపై ధరలు తగ్గించింది. ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీలపై కూడా సుంకాలు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ బడ్జెట్లోనూ అదే కొనసాగించే అవకాశం ఉంది.
మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం తన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ)ని పునరుద్ధరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. విదేశాల్లో విక్రయించినప్పుడు కూడా భారతదేశ ఉత్పత్తులను అత్యుత్తమంగా పరిగణించడం కేంద్ర పథకం లక్ష్యం. పీఎల్ఐ పథకం కింద పరిశ్రమలు పెరగడంతోపాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తోంది. ఇంతేకాకుండా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ పరిశ్రమలకు కూడా ఊతమిచ్చేలా కేంద్ర బడ్జెట్లో నిర్ణయాలు ఉంటాయని ఐటీ నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter