Bestune Xiaoma mini EV Price: వరల్డ్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ప్రముఖ చైనా కంపెనీ ఫస్ట్ ఆటో వర్క్స్ (FAW) గత సంవత్సరం బెస్ట్యూన్ బ్రాండ్ భాగస్వామ్యంతో Xiaoma స్మాల్ బెస్ట్యూన్ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కారు రూ.3 లక్షల కంటే తక్కువ ధరలో లభించడంతో చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే Xiaoma కంపెనీ ఈ స్మాల్ ఎలక్ట్రిక్ కారును త్వరలోనే భారత మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కారు అనేక ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రావడం వల్ల టాటా టియాగో EV, MG కామెట్ EVలతో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. లాంచింగ్‌కి ముందే ఈ కారుకు భారత ఆటో మార్కెట్‌లో మంచి టాక్ వినిపిస్తోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటీరియర్:
షావోమీ కంపెనీ ఈ బెస్ట్యూన్ స్మాల్ (Bestune Xiaoma mini EV) కారును ఏప్రిల్ నెల 2023 సంవత్సరంలో షాంఘై ఆటో షోలో లాంచ్ చేసింది. దీనిని కంపెనీ రెండు వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రస్తుతం ఇది హార్డ్‌టాప్, కన్వర్టిబుల్ అనే వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుత కంపెనీ చైనా మార్కెట్‌లో కేవలం హార్డ్‌టాప్ వేరియంట్‌ను మాత్రమే విక్రయిస్తోంది. ఈ కారు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది 7-అంగుళాల యూనిట్‌తో లభిస్తోంది. అలాగే ఇది ప్రీమియం డ్యాష్‌బోర్డ్‌ను కలిగి ఉంటుంది. అలాగే కస్టమర్స్‌ను ఆకర్శించేందుకు డ్యూయల్-టోన్ థీమ్ ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇది ఏరోడైనమిక్ వీల్స్ సెటప్‌తో లభిస్తోంది. ఇవే కాకుండా మరెన్నో ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.
ఈ బెస్ట్యూన్ (Bestune Xiaoma mini EV) కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 1,200 కిమీపై మైలేజీని కలిగి ఉంటుంది. దీంతో పాటు వీల్‌బేస్ 2700-2850 mmను కలిగి ఉంటుంది. అలాగే ఈ కారు నడిచేందుకు శక్తి అందించేందుకు 20 kW ఎలక్ట్రిక్ మోటారుతో అందుబాటులోకి వచ్చింది. అలాగే దీని బ్యాటరీ లిథియం-ఐరన్ ఫాస్ఫేట్ (LFP) యూనిట్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే దీనికి డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ కారు కొలతల విషయానికొస్తే, బెస్టూన్ షావోమా పొడవు 3000 మిమీ, వెడల్పు 1510 మిమీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఎత్తు 1630 మిమీ ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
షావోమీ బెస్ట్యూన్ కారు టాప్ 10 ఫీచర్స్:
షావోమీ బెస్ట్యూన్ కారు ఆకర్షణీయమైన డిజైన్
పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
హెడ్స్-అప్ డిస్ప్లే
వాయిస్ కంట్రోల్
అనేక డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు
పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ మూడు వేరియంట్స్
ఎయిర్‌బ్యాగ్‌లు
ABS
EBD
ESP
ట్రాక్షన్ కంట్రోల్
గ్లోబల్ వారంటీ
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి