WION EV Conclave: నేడే వియాన్ ఓల్టేజ్ డ్రైవ్.. హైదరాబాద్‌లో మెగా ఈవెంట్‌

WION EV Conclave in Hyderabad: ప్రముఖ వార్త వేదిక వియాన్ హైదరాబాద్‌లో మెగా ఈవెంట్‌ నిర్వహిస్తోంది. వోల్టేజ్-లీడింగ్ ది ఛార్జ్' పేరుతో హైదరాబాద్‌లో గురువారం ఈవెంట్ జరగనుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 5, 2023, 12:29 PM IST
WION EV Conclave: నేడే వియాన్ ఓల్టేజ్ డ్రైవ్.. హైదరాబాద్‌లో మెగా ఈవెంట్‌

WION EV Conclave in Hyderabad: ప్రస్తుతం మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో పురోగతి భారీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వార్తా వేదిక వియాన్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్-మొబిలిటీ ప్రకటించింది. గురువారం 'వోల్టేజ్-లీడింగ్ ది ఛార్జ్' పేరుతో హైదరాబాద్‌లో మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల గురించి హై-ప్రొఫైల్ ఈవెంట్ ఆలోచనాపరులు, విధాన రూపకర్తలు, ఇండస్ట్రీ నిపుణులు తమ అనుభవాలను పంచుకోవడానికి, ఈవీ విభాగంలో సహకారం, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఈ ఈవెంట్ ఓ వేదికకానుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీకి సంబంధించిన కీలక అంశాలను కవర్ చేస్తూ నాలెడ్జ్ సెషన్‌లు, ప్యానెల్ డిస్కషన్‌లు, కీలక ప్రసంగాలు ఉంటాయి.

ప్రభుత్వం, ఇండస్ట్రీలు, విద్యాసంస్థల నుంచి ప్రముఖులు, రాజకీయ నాయకులు మన దేశంలో ఎలక్ట్రిక్ వాహన పర్యావరణ వ్యవస్థను ఎలా ఉత్తమంగా రూపొందించాలనే విషయంపై వారి దృక్కోణాలు, ఆలోచనలను పంచుకుంటారు. ఈ ఈవెంట్‌కు ఎలక్ట్రిక్ వాహనం, ఆటోమోటివ్, టెక్ పరిశ్రమల నుంచి ప్రముఖులు హాజరవుతారు. ఎంపీ సంతోష్ కుమార్ జోగినిపల్లి, మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్, వోల్వో ఆటో ఇండియా ఎండీ జ్యోతి మల్హోత్రా, స్టెల్లంటిస్ ఇండియా డిప్యూటీ ఎండీ ఆదిత్య జైరాజ్, టాటా పవర్ హెడ్ బీడీ వీరేంద్ర గోయల్ ఇతరులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.

వియోన్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మధు సోమన్ మాట్లాడుతూ.. వోల్టేజ్-లీడింగ్ ది ఛార్జ్" మన ప్రపంచాన్ని రూపొందించే కీలకమైన సమస్యలపై చర్చలను నడిపించడంలో వియన్ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. ఈ సమ్మేళనం హాజరైన వారికి ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ ప్రముఖులతో కనెక్ట్ అవ్వడానికి మంచి అవకాశంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ఈవెంట్‌కు హాజరై తమ ఆలోచనలను పంచుకోవాలని కోరారు. మన దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ అద్భుతమైన సామర్థ్యాన్ని గురించి తెలుసుకోవాలని సూచించారు. ఈ ఈవెంట్‌లో విధానాలు, పెట్టుబడులు, ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ పథాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. 

కాగా.. 'వోల్టేజ్ - లీడింగ్ ది ఛార్జ్' ఈవెంట్ తెలంగాణ ప్రభుత్వం (స్టేట్ పార్టనర్) భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ నాలెడ్జ్ పార్టనర్‌గా సపోర్ట్ చేస్తోంది. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, రవాణారంగంలో మార్పులు తీసుకువచ్చేందుకు వియాన్ ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తోంది.

Also Read: ICC World Cup 2023: వరల్డ్ కప్ ఆరంభానికి ముందు బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. నిరాశలో క్రికెట్ అభిమానులు  

Also Read: TSRTC Employees DA: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. అన్ని డీఏలు మంజూరు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News