Wifi Speed Boost: ఇంట్లో వైఫై నెట్ సౌకర్యముండేవారికి తరచూ ఎదురయ్యే సమస్య నెట్ స్పీడ్ తగ్గుతుండటం. ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓ చిన్న డివైస్..సహాయంతో నెట్ స్పీడ్ పెంచుకోవచ్చు..
ఇళ్లు కాస్త పెద్దదిగా ఉంటే వైఫై నెట్‌వర్క్ పూర్తిగా రాక ఇబ్బందులు ఎదుర్కొంటుంటాం. కొన్ని గదుల్లో నెట్ స్పీడ్‌గా ఉంటే..మరి కొన్ని గదుల్లో చాలా తక్కువగా ఉంటుంది. ఫలితంగా తరచూ ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఓ మార్గాన్ని సూచిస్తున్నారు టెక్ నిపుణులు.
వైఫై నెట్‌వర్క్ స్పీడ్ పెంచేందుకు ఇప్పుడు మార్కెట్‌లో ఓ కొత్త డివైస్ అందుబాటులో ఉంది. ఈ డివైస్ సహాయంతో ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోవచ్చు. ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ మాత్రమే. ఈ డివైస్ అమర్చుకోవడం వల్ల వైఫై స్పీడ్ చాలా వేగవంతమౌతుంది. అంతేకాదు..ఇంట్లో పది గదులున్నా సరే..ఒకే వేగం ఉంటుంది. ఆ డివైస్ ఏంటి, ధర ఎంత, ఎలా వాడాలనేది తెలుసుకుందాం..
ఈ డివైస్ పేరు వైఫై ఎక్స్‌టెండర్, ఇది మార్కెట్‌లో విరివిగా లభిస్తోంది. చూడ్డానికి ఇది మస్కిటో రిపెల్లెంట్‌లా కన్పిస్తుంది. దీనిని మీ ఇంట్లో పవర్ సాకెట్‌లో ప్లగిన్ చేస్తే చాలు. ఒకసారి ఆన్ చేస్తే వైఫై స్పీడ్ అమాంతం పెరుగుతుంది. ఇంట్లో ప్రతిమూలకు ఒకే స్పీడ్ అందుతుంది. మార్కెట్‌లో వైఫై ఎక్స్‌టెండర్‌లు చాలా రకాలున్నాయి. మీ ఇంటి సైజ్, గదుల సంఖ్య ఆధారంగా నచ్చిన డివైస్ తీసుకోవాలి.
ఈ వైఫై ఎక్స్‌టెండర్ ధర 1500 నుంచి 4000 వరకూ ఉంది. రెండింటిలో పెద్ద తేడా ఉండదు కానీ సైజ్ పెరిగే కొద్దీ సిగ్నల్ బూస్ట్ పెరుగుతుంది. మీ ఇంటిని బట్టి ఏ సైజ్ అనేది నిర్ణయించుకోవాలి.
Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, ట్రావెలింగ్ విషయంలో కొత్త నియమాలు
Also read: LIC Saral Pension Yojana: సింగిల్ ప్రీమియం చెల్లిస్తే..జీవితాంతం నెలకు 50 వేల రూపాయల పెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Wifi Speed Boost: ఇంట్లో నెట్ స్పీడ్ వేధిస్తోందా..ఈ చిన్న డివైస్‌తో పది రెట్ల వేగం