AC Car Using Tips: కారులో ఏసీ త్వరగా చల్లబడటం లేదా ?

AC Car Using Tips:హాట్ సమ్మర్‌లో కారులో ఏసీ సరిగ్గా పనిచేయకపోతే అందులో ప్రయాణం చేయడం అంత నరకం మరొకటి ఉండదు అనే విషయం తెలిసిందే. కారులో ఏసీ ఉంటే కేవలం చల్లదనం మాత్రమే కాదు.. ఎండ వేడితో కలిగే జబ్బులను కూడా దూరం పెట్టొచ్చు. ఎండ వేడి నుంచి కలిగే అసౌకర్యం, జబ్బులను దూరం పెట్టాలంటే కారులో ఏసి ప్రాపర్ వర్కింగ్ కండిషన్‌లో ఉండాల్సిందే.

Written by - Pavan | Last Updated : May 16, 2023, 05:47 PM IST
AC Car Using Tips: కారులో ఏసీ త్వరగా చల్లబడటం లేదా ?

AC Car Using Tips: హాట్ సమ్మర్‌లో కారులో ఏసీ సరిగ్గా పనిచేయకపోతే అందులో ప్రయాణం చేయడం అంత నరకం మరొకటి ఉండదు అనే విషయం తెలిసిందే. కారులో ఏసీ ఉంటే కేవలం చల్లదనం మాత్రమే కాదు.. ఎండ వేడితో కలిగే జబ్బులను కూడా దూరం పెట్టొచ్చు. ఎండ వేడి నుంచి కలిగే అసౌకర్యం, జబ్బులను దూరం పెట్టాలంటే కారులో ఏసి ప్రాపర్ వర్కింగ్ కండిషన్‌లో ఉండాల్సిందే. 

ముందుగా విండో గ్లాసెస్ దించి కారు లోపల ఉన్న ఎండ వేడిని బయటికి వెళ్లేలా చేయాలి. కారులో వేడి తగ్గిన తరువాత ఏసీ స్విఛ్చాన్ చేస్తే కారు లోపలి వాతావరణం త్వరగా చల్లబడుతుంది.

కారును నీడల్ పార్క్ చేయాలి
కారు నేరుగా ఎండలో పార్క్ చేసినప్పుడు క్యాబిన్ హీటెక్కి కారులో ఉక్కపోత పెరుగుతుంది. అలా కాకుండా కారును నీడలో పార్కింగ్ చేసినట్టయితే.. ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.

ఏసీ కండెన్సర్ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. 
ఏసీ సరిగ్గా పనిచేయడంలో ఏసీలో ఉండే కండెన్సర్ కీలక పాత్ర పోషిస్తుంది. కండెన్సర్ లో దుమ్ము, దూళి లాంటివి చిక్కుకున్నప్పుడు అది ఎండ వేడీని అబ్జార్బ్ చేసుకుని కూల్ ఎయిర్ రిలీజ్ చేయడంలో ఆలస్యం అవుతుంది. అందుకే కండెన్సర్ వర్కింగ్ కండిషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ప్రతీ ఏడాది సమ్మర్ లో కండెన్సర్ కండిషన్ చెక్ చేయించాలి.

రీసర్కులేషన్ మోడ్ ఉపయోగించండి
కారులో ఏసీ స్విచాన్ చేశాకా రీసర్క్యూలేషన్ మోడ్ టర్న్ ఆన్ చేయండి. అలా చేయడం వల్ల మళ్లీ బయటి నుంచి వచ్చే వేడి గాలిని ఏసీ మెషిన్ లోపలికి రానివ్వకుండా అఢ్డుకుంటుంది.

రెగ్యులర్ ఏసీ సర్విసింగ్
సాధారణంగా కారులో ఏసీని సంవత్సరం పొడుగునా ఉపయోగించరు కనుక కొన్ని సందర్భాల్లో ఏసీ మెషిన్‌లోని కొన్ని భాగాల పని తీరు ఎప్పుడు, ఎలా ఉండేది తెలియదు. అందుకే  కారులో రెగ్యులర్‌గా ఏసీ సర్విసింగ్ చేయిస్తూ ఉండాలి.

ఏసీ ఆన్ చేయడానికంటే ముందుగా..
కారులో ఏసీ ఆన్ చేయడానికంటే ముందుగా కారు విండో అద్దాలు పైకి ఎక్కించడం మర్చిపోవద్దు. లేదంటే లోపల రిలీజైన ఏసీ అద్దాల ద్వారంలోంచి బయటికి వెళ్లిపోతుంది. ఫలితంగా కారు చల్లబడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

Trending News