Whatsapp Security: ప్రముఖ సోషల్ మీడియా ఇన్స్టంట్ మెస్సేజింగ్ యాప్ వాట్సప్‌లో భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటికి ఉన్న సెక్యూరిటీకు తోడు..అదనంగా మరో వెరిఫికేషన్ ప్రోసెస్ ప్రవేశపెట్టనుంది. అదే డబుల్ వెరిఫికేషన్. అసలిదేంటో చూద్దాం..
మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఇప్పటికే యూజర్ల డేటా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. వివిద రకాల స్కామ్స్ నుంచి యూజర్లను రక్షించేందుకు ఎప్పటికప్పుడు అదనపు భద్రతను జోడిస్తుంటోంది. ఇప్పుడు కొత్తగా మరో సెక్యూరిటీని ప్రవేశపెడుతోంది. అదే డబుల్ వెరిఫికేషన్ ప్రోసెస్.
WABetainfo నివేదిక ప్రకారం..వాట్సప్ ప్రస్తుతం డబుల్ వెరిఫికేషన్ పద్ధతిని టెస్ట్ చేస్తోంది. ఇతర ఏ డివైస్ నుంచి వాట్సప్‌కు లాగిన్ అయినా సరే..అదనంగా వెరిఫికేషన్ కోడ్ తప్పనిసరి చేయనుంది. ఈ డబుల్ వెరిఫికేషన్ పద్ధతి ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం..
ప్రస్తుతం ఎవరైనా వాట్సప్ యూజర్ మరో డివైస్‌పై లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తే..6 అంకెల వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు WABetainfo అందించిన వివరాల ప్రకారం...ఫస్ట్ కోడ్ విజయవంతమైన తరువాత...మరో ఆరంకెల కోడ్ లాగిన్ అయ్యేందుకు తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. ఫలితంగా యూజర్‌కు మరో ఎలర్ట్ మెస్సేజ్ వెళ్తుంది. యూజర్‌కు తెలియకుండా ఎవరైనా లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటే..సంబంధిత యూజర్‌కు తెలిసిపోతుంది. రెండవ వెరిఫికేషన్ కోడ్ లేకుండా లాగిన్ అవలేరు. ఈ కొత్త ఫీచర్ వాట్సప్ త్వరలో అందుబాటులో తీసుకురానుంది.
కొత్త ఫీచర్ ఎప్పుడు రావచ్చు
ప్రస్తుతం ఈ డబుల్ వెరిఫికేషన్ ప్రోసెస్ అనేది అభివృద్ధి దశలో ఉంది. ఎప్పుడు లాంచ్ చేసేది ఇంకా ఖరారు కాలేదు. అయితే టెస్టింగ్ ప్రక్రియ పూర్తయితే..ఒకేసారి ఐవోఎస్, ఆండ్రాయిడ్‌లో లాంచ్ కానుంది. ఇవి కాకుండా ఇంకా చాలా ఇతర ఫీచర్లు టెస్టింగ్ దశలో ఉన్నాయి. డబుల్ వెరిఫికేషన్ ప్రోసెస్ మాత్రం వాట్సప్ యూజర్ల భద్రతను మరింత పెంచనుందని తెలుస్తోంది.
Also read: Home Loan EMI Offers: హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేటు ఏ బ్యాంకులో ఎంత ఉంది, కావల్సిన అర్హతలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook