Whatsapp Services: డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, మార్క్‌లిస్ట్‌లు వాట్సప్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

Whatsapp Services: ప్రముఖ సోషల్ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ అందరికీ సాధారణమైపోయింది. వాట్సప్ లేనిదే పని జరగడం లేదు. నిత్యావసరమైన డాక్యుమెంట్లు కూడా వాట్సప్‌లో భద్రపర్చుకునే పరిస్థితి ఉంటోంది. మీకు నిత్యం అవసరమయ్యే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డుల్ని కూడా వాట్సప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 31, 2024, 10:52 AM IST
Whatsapp Services: డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, మార్క్‌లిస్ట్‌లు వాట్సప్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

Whatsapp Services: వాట్సప్‌లో కొత్తగా ప్రారంభించిన ఛాట్‌బోట్ ఆప్షన్ ద్వారా ప్రభుత్వ డాక్యుమెంట్లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నిర్దిష్టమైన నెంబర్‌కు మెస్సేజ్ చేయడం ద్వారా కొన్ని సూచనలు ఫాలో అయితే చాలు. మీక్కావల్సిన మీ ప్రభుత్వ డాక్యుమెంట్లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్‌లో చాలా ఫీచర్లు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందిస్తోంది.  అతి ముఖ్యమైన డాక్యుమెంట్లను సైతం డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ కల్పిస్తోంది. MyGov-వాట్సప్ భాగస్వామ్యంతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కీలకమైన డాక్యుమెంట్లను డిజిలాకర్ సేవలతో డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం అందుతోంది. డిజిలాకర్ ఎక్కౌంట్ అథెంటికేట్ చేయడం ద్వారా డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేయవచ్చు. MyGov Helpdesk ద్వారా వాట్సప్ యూజర్లు చాలా సులభంగా డిజిలాకర్ యాక్సెస్ పొందవచ్చు. వాట్సప్‌లో కొత్తగా ప్రారంభించిన చాట్‌బోట్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, సీబీఎస్ఈ 10వ తరగతి సర్టిఫికేట్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ పాలసీ, 10వ తరగతి, 12వ తరగతి మార్క్ షీట్లు, ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేయవచ్చు. దీనికోసం మరే ఇతర ధర్డ్ పార్టీ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవల్సిన అవసరం లేదు.

వాట్సప్ నుంచి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి

ముందుగా వాట్సప్ యూజర్లు 9013151515 నెంబర్ మెస్సేజ్ పంపించాలి. ముందుగా ఈ నెంబర్‌ను మీ కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకుని హెల్లో లేదా డిజిలాకర్ టైప్ చేసి పంపించాలి. ఇప్పుడు మీ స్క్రీన్‌పై MyGov Helpdesk నుంచి ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయో లిస్ట్ కన్పిస్తుంది. మీక్కావల్సిన సర్వీస్ ఎంచుకుని అక్కడ ఇచ్చే సూచనలు పాటించాలి. డిజిలాకర్ యాప్‌తో లింక్ అయిన మొబైన్ నెంబర్‌తో మాత్రమే మెస్సేజ్ పంపించాల్సి ఉంటుంది. 

MyGov Helpdesk ద్వారా డౌన్‌లోడ్ అయిన డాక్యుమెంట్లు గతంలో డిజిలాకర్లో డాక్యుమెంట్లు భద్రపర్చుకున్నవారికే వర్తిస్తాయి. చాట్ విండో ఆప్షన్ ఎంచుకుని సూచనలు పాటిస్తే ఆ డాక్యుమెంట్లు డౌన్‌లోడ్ అవుతాయి. 

Also read: Pan Card Reprint: పాన్ కార్డు వివరాలు చెరిగిపోయాయా, ఆన్‌లైన్‌లో కొత్తది ఇలా రీ ప్రింట్ చేసుకోవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News