CIBIL SCORE: మీ సిబిల్ స్కోర్ బాగోలేదా..సిబిల్ స్కోర్ ఎలా మెరుగుపర్చుకోవాలో తెలుసా

CIBIL SCORE: సిబిల్ స్కోర్. బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థలు ఓ వ్యక్తిని నమ్మే కొలమానం ఇదే. వ్యక్తి  కంటే సిబిల్ స్కోరే అతి ముఖ్యం. సిబిల్ స్కోర్ బాగుంటే ఓకే. బాగా లేకపోతే ఎలా మెరుగు పర్చుకోవాలో చూద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 4, 2022, 06:15 AM IST
CIBIL SCORE: మీ సిబిల్ స్కోర్ బాగోలేదా..సిబిల్ స్కోర్ ఎలా మెరుగుపర్చుకోవాలో తెలుసా

CIBIL SCORE: సిబిల్ స్కోర్. బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థలు ఓ వ్యక్తిని నమ్మే కొలమానం ఇదే. వ్యక్తి  కంటే సిబిల్ స్కోరే అతి ముఖ్యం. సిబిల్ స్కోర్ బాగుంటే ఓకే. బాగా లేకపోతే ఎలా మెరుగు పర్చుకోవాలో చూద్దాం.

ఓ బ్యాంకు నుంచి గానీ ఫైనాన్స్ సంస్థ నుంచి గానీ లోన్ తీసుకోవాలన్నా లేదా క్రెడిట్ కార్డు లేదా కరెంట్ ఎక్కౌంట్ తీసుకోవాలంటే అన్నింటికంటే ముఖ్యంగా కావల్సింది సిబిల్ స్కోర్. ఒక వ్యక్తిని నమ్మేందుకు కావల్సిన కొలమానం లాంటిది ఇది. ఆ మనిషికి ఎన్ని ఆస్థులున్నా..ఎంత సంపాదన ఉన్నా అనవసరం. సిబిల్ స్కోర్ బాగుంటేనే రుణం లభిస్తుంది. సిబిల్ స్కోర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే..సిబిల్ స్కోర్ నెగెటివ్ ర్యాంకింగ్ ప్రతి బ్యాంకు, ప్రతి ఫైనాన్స్ సంస్థకు ఆటోమేటిక్‌గా చేరిపోతుంది. 

మీరు ఒకవేళ లోన్ డిఫాల్టర్ (Loan Defaulter) అయినా లేదా తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించకపోయినా మీ సిబిల్ స్కోర్ పాడయిపోతుంది. సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోతే రుణం మంజూరు కాదు. క్రెడిట్ కార్డు తిరస్కరించబడుతుంది. ఇలా చాలా ప్రతికూలత ఎదురవుతుంది. ఒకవేళ రుణం లభించినా..ఎక్కువ వడ్డీ చెల్లించాల్సివస్తుంది. ఒకసారి నెగెటివ్ వచ్చిన సిబిల్ స్కోర్ జీవితాంతం అలానే ఉంటుందా..మెరుగుపర్చుకునే మార్గమేమైనా ఉందా లేదా.

సిబిల్ స్కోర్‌ని ఎలా అర్ధం చేసుకోవాలి

సిబిల్ స్కోర్ (Cibil Score) వ్యవహారాన్ని సింపుల్‌గా అర్ధం చేసుకోవాలంటే..మీరు ఇళ్లు నిర్మించుకునేందుకు ఓ రుణం తీసుకున్నారు. ప్రారంభంలో వాయిదాలు (EMI) బాగానే చెల్లించేశారు. అయితే హఠాత్తుగా  లాక్‌డౌన్ లేదా మరే ఇతర కారణంతో మీ పరిస్థితి తలకిందులైపోయింది. ఈ పరిస్థితుల్లో వాయిదాలు చెల్లించలేకపోతున్నారు. దాంతో బ్యాంకు మిమ్మల్ని లోన్ డిఫాల్టర్‌గా ప్రకటించేసింది. ఆ తరువాత మీ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి..వడ్డీతో సహా బాకీ ఉన్న వాయిదాల్ని చెల్లించేశారు. దాంతో పాడైన మీ సిబిల్ స్కోర్ తిరిగి మెరుగుపడిపోయిందనుకుంటారు మీరు.  కానీ ఒకసారి సిబిల్ స్కోర్ పాడైన తరువాత తిరిగి మెరుగుపడేందుకు కనీసం రెండేళ్లు పడుతుంది. 

సిబిల్ స్కోర్ నెగెటివ్ ర్యాంకింగ్ అనేది ప్రతి చోటా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ప్రతి బ్యాంకు, ప్రతి ఫైనాన్స్ సంస్థకు చేరిపోతుంది. ఎక్కడ ఎప్పుడు ఏ బ్యాంక్ లేదా ఏ ఫైనాన్స్ సంస్థకు రుణం కోసం వెళ్లినా...మీ సిబిల్ స్కోర్ తెలిసిపోతుంది. ఒకవేళ వేరే ఇతర కారణాలతో రుణం లభించినా..వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. 

సిబిల్ స్కోర్ ఎలా మెరుగుపర్చుకోవాలి ( How to Improve Cibil Score)

మీ లావాదేవీలు, క్రెడిట్ కార్డు (Credit Card)లేదా చిన్న చిన్న బిల్లుల చెల్లింపులను బట్టి మీ సిబిల్ స్కోర్ మెరుగుపడుతూ ఉంటుంది. బిల్లుల పేమెంట్‌ను ఎప్పుడూ ఆలస్యం చేయవద్దు. సకాలంలో చెల్లించడం అలవాటు చేసుకోండి. క్రెడిట్ కార్డుకు సంబంధించి అయితే పెండింగ్ బిల్లు పూర్తిగా చెల్లించేయండి. చాలా సందర్భాల్లో బ్యాంకు రుణం తీసుకుని సకాలంలో చెల్లించేసినా ఎన్ఓసీ తీసుకోరు. దాంతో సిబిల్ స్కోర్ నెగెటివ్ చూపిస్తుంటుంది. బ్యాంకు నుంచి ఎప్పుడూ ఎన్ఓసీ తీసుకోవడం మర్చిపోవద్దు. అప్పుడే మీ సిబిల్ స్కోర్ అప్‌డేట్ అవుతుంటుంది. క్రెడిట్ కార్డును ఎప్పుడైనా క్లోజ్ చేసినప్పుడు దానికి సంబంధించిన పేపర్ వర్క్ పూర్తి చేయడం తప్పనిసరి. క్రెడిట్ కార్డు క్లోజ్ అయినట్టు సూచించే సర్ఠిఫికేట్ బ్యాంకు నుంచి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇలా చేస్తే సిబిల్ స్కోర్ తిరిగి మెరుగుపడుతుంది.

Also read: One Moto India Launch: రూ.250 కోట్లతో తెలంగాణలో బ్రిటీష్ ఈ-స్కూటర్ సంస్థ ప్లాంట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News