CIBIL Score Facts: సిబిల్ స్కోర్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా ?

Things to Know About CIBIL Score: సిబిల్ స్కోర్ కనిష్టంగా ఎంత నుంచి మొదలవుతుంది, గరిష్టంగా ఎంత వరకు ఉంటుంది ? మీ లోన్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా ? 

Written by - Pavan | Last Updated : Apr 26, 2023, 09:26 PM IST
CIBIL Score Facts: సిబిల్ స్కోర్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా ?

Things to Know About CIBIL Score: సిబిల్ స్కోర్.. 3 అంకెలు కలిగిన ఈ సిబిల్ స్కోర్ మీ జీవితంలో చాలా కీలక పాత్ర పోషిస్తుందనే విషయం మీరు ఏదో ఓ బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడో లేక క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడో తెలిసే ఉంటుంది. సిబిల్ కి ఫుల్ ఫామ్ ఏంటంటే.. క్రెడిట్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. దీనినే క్లుప్తంగా సిబిల్ అంటుంటారు. ఈ సిబిల్ సంస్థ ఒక వ్యక్తి క్రెడిట్ హిస్టరీ ఆధారంగా వారికి ఇచ్చే నివేదికలో ఉండే మూడు అంకెల డిజిట్స్ నే ఈ సిబిల్ స్కోర్ అంటుంటాం. 

గతంలో మీరు బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి క్రమశిక్షణతో, సరైన సమయంలో చెల్లించారా లేదా అని చూసి, అన్నీ సరిగ్గా ఉంటేనే మంచి సిబిల్ స్కోర్ ఇస్తారు. అలా కాకుండా గతంలో తీసుకున్న లోన్ మొత్తాన్ని కానీ లేదా క్రెడిట్ కార్డు బిల్లులను కానీ తిరిగి చెల్లించడంలో జాప్యం చేయడం లేదా అసలు చెల్లించకపోవడం లాంటివి ఉన్నట్టయితే.. మీ సిబిల్ స్కోర్ డ్యామేజీ అయినట్టే లెక్క. ఆ సిబిల్ స్కోర్ ఆధారంగానే మీరు కొత్తగా చేసుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలా లేదా అనే విషయంలో బ్యాంకులు ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. 

300 నుంచి 900 
సిబిల్ స్కోర్ 300 నుంచి 900 వరకు ఉంటుంది. 300 సిబిల్ స్కోర్ ని బ్యాడ్ సిబిల్ స్కోర్ గా పరిగణిస్తే.. 900 సిబిల్ స్కోర్ ని హైయెస్ట్ సిబిల్ స్కోర్ గా పరిగణిస్తారు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే మీ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే బ్యాంకులు వారి ప్రొఫైల్‌పై విశ్వాసం చూపించవు. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ హెల్తీగా ఉన్నట్టయితే.. మీ లోన్ రిక్వెస్ట్ విజయవంతంగా పూర్తయి రుణం మంజూరు అవడమే కాకుండా.. తక్కువ వడ్డీ రేటుకే రుణం కూడా పొందే అవకాశం ఉంటుంది.

సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే కలిగే లాభాలు
సులభంగా రుణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉండటం

లోన్ అప్లికేషన్ త్వరగా అప్రూవ్ అవడం

తక్కువ వడ్డీ రేటుకే రుణాలు మంజూరు కావడం

రెంట్ ప్రాపర్టీల్లో ఉండి కూడా రుణం పొందగలగడం

ఎక్కువ క్రెడిట్ లిమిట్‌తో ఎగ్జైటింగ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్

సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే కలిగే నష్టాలు
లోన్ అప్లికేషన్ తిరస్కరణకు గురవడం

ఒకవేళ లోన్ అప్లికేషన్ ఓకే అయినప్పటికీ.. వడ్డీ రేటు సాధారణం కంటే ఎక్కువగా చార్జ్ చేయడం

డ్యాక్యుమెంటేషన్ ప్రక్రియ మరింత కఠినంగా ఉండటం

క్రెడిట్ కార్డ్స్ అప్లికేషన్స్ రిజెక్ట్ అవడం 

ఒకవేళ క్రెడిట్ కార్డ్ ఇచ్చినప్పటికీ ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఇవ్వకపోవడం

Trending News