Google Chrome Update: గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను వెంటనే అప్డేట్ చేసుకోండి! లేదంటే ఇక అంతే..

Google Chrome Update: మీరు గూగుల్ క్రోమ్ ను తరచుగా మీ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లో యూజ్ చేస్తున్నారా? అయితే ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే! మీ కంప్యూటర్ లో 97.0.4692.71 కంటే పాతర వర్షన్ గూగుల్ క్రోమ్ వాడుతుంటే దాన్ని వెంటనే అప్డేట్ చేసేయండి. లేదంటే సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉందని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ సంబంధించిన సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2022, 08:10 AM IST
Google Chrome Update: గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను వెంటనే అప్డేట్ చేసుకోండి! లేదంటే ఇక అంతే..

Google Chrome Update: గూగుల్ క్రోమ్ యూజర్లకు గమనిక! మీరు మీ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లో గూగుల్ క్రోమ్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నారా? లేదంటే మీ కంప్యూటర్ లేదా ల్యాప్ ట్యాప్ భయంకరమైన మాలిషియస్ వైరస్ ద్వారా సైబర్ నేరగాళ్లు దాడి చేసే అవకాశం ఉంది. ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన టీమ్ కీలక హెచ్చరిక జారీ చేసింది. 

గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్ యూజర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ సంస్థ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఈ కీలక హెచ్చరిక జారీ చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద ఈ ఏజెన్సీ పనిచేస్తుంది. 97.0.4692.71 కంటే పాత వెర్షన్‌ గూగుల్‌ క్రోమ్‌ వాడుతున్న వారి డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లు సైబర్‌ దాడికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ ఏజెన్సీ హెచ్చరించింది. 

ఈ మేరకు ఇటీవల కాలంలో జరిగిన దాడులను వివరించింది. వీటిని దృష్టిలో పెట్టుకొని వినియోగదారులందరూ గూగుల్‌ క్రోమ్‌ తాజా వెర్షన్‌కు అప్‌డేట్‌ కావాలని సూచించింది. తద్వారా గూగుల్‌ క్రోమ్‌లోని పలు సాంకేతిక లోపాలకు పరిష్కారం లభించడమే కాకుండా.. సిస్టమ్స్‌పై సైబర్‌ కేటుగాళ్లకు నియంత్రణ సాధ్యపడదని వెల్లడించింది.

మరోవైపు మొబైల్స్‌కు సంబంధించి గూగుల్‌ క్రోమ్‌ యాప్‌తోపాటు ఇతర యాప్‌లను ఎప్పుటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ ఉండాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా హ్యాకర్ల దాడి నుంచి తప్పించుకోవచ్చని పేర్కొన్నారు. 

అలాగే అనుమానాస్పదంగా అనిపించే యాప్‌లు‌, ఈమెయిల్స్‌, వ్యక్తిగత సమాచారం అడిగే లింక్‌ల జోలికి వెళ్లొద్దని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇటువంటి లింక్‌లు ప్రమాదకర స్పైవేర్లను సిస్టమ్స్‌లోకి జొప్పిస్తాయి.  

Also Read: Todays Gold Price: నిలకడగా బంగారం, దేశంలో వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Also Read: Bad news: గృహోపకరణాల ధరలకు రెక్కలు.. ఎంత శాతం పెరుగుతాయో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News