Aadhaar card: ఆధార్‌కార్డు అడ్రస్‌ను ఇంట్లోంచే సులభంగా ఎలా అప్‌డేట్ చేయడం

Aadhaar card: ఆధార్‌కార్డు విషయమై యూఐడీఏఐ ఎప్పటికప్పుడు ఇచ్చే అప్‌డేట్స్ గమనిస్తుండాలి. ఎందుకంటే ఆధార్‌కార్డులో కన్పించే తప్పుల్ని సరిదిద్దే అవకాశం కల్పిస్తుంది. ఈ తప్పుల్ని ఇంట్లోంచే చేయవచ్చు కూడా.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 4, 2022, 12:17 AM IST
Aadhaar card: ఆధార్‌కార్డు అడ్రస్‌ను ఇంట్లోంచే సులభంగా ఎలా అప్‌డేట్ చేయడం

దేశంలోని ప్రతి పౌరుడికీ తప్పకుండా అవసరమైంది ఆధార్‌కార్డు. ప్రతి చిన్న పనికీ ఆధార్..ఆధారమైంది. ప్రభుత్వ ప్రయోజనాల్ని పొందేందుకు ఆధార్‌కార్డ్ అనివార్యమైంది. బ్యాంక్ ఎక్కౌంట్, సిమ్‌కార్డ్ మాత్రమే కాదు..ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఆధార్‌కార్డ్ కీలకం. అందుకే ఇప్పుడు ఆధార్‌కార్డ్‌కు సంబంధించి కీలకమైన అప్‌డేట్ విడుదలైంది.

చాలా సార్లు ఆధార్‌కార్డ్‌లో వివరాలు తప్పుగా నమోదవుతుంటాయి. ఈ తప్పుల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంటుంది. ఆ తప్పుల్ని సరిచేస్తే కానీ ఆధార్ ద్వారా అందే ప్రయోజనాలు అందవు. 

ఆధార్‌కార్డు జారీ చేసే యూఐడీఏఐ ఇప్పుడు ఆ తప్పుల్ని సరిచేసేందుకు అవకాశం కల్పిస్తుంది. ఎక్కువగా తప్పులు పేరు, అడ్రస్ విషయంలో జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఆధార్‌కార్డులో నమోదైన పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, మొబైల్, ఈమెయిల్ ఐడీ వివరాల్లో తప్పులుంటే కేవలం 50 రూపాయల ఫీజుతో సరి చేసుకోవచ్చు.

ఇవి కాకుండా బయోమెట్రిక్ వివరాల్ని అప్‌డేట్ చేసేందుకు కేవం 100 రూపాయలు ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఆధార్‌కార్డుకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే..https://resident.uidai.gov.in/file-complaintలో ఫిర్యాదు చేయవచ్చు. ఆధార్‌కార్డును ఇంట్లోంచే ఆన్‌లైన్ విధానంలో అప్‌డేట్ చేయవచ్చు. దీనికోసం ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ ఓపెన్ చేసి..ప్రొసీడ్ టు అప్‌డేట్ అడ్రస్ క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్ నమోదు చేశాక..ఓటీపీ జనరేట్ అవుతుంది. ఓటీపీతో లాగిన్ కావాలి. ఆ తరువాత అడ్రస్ అప్‌డేట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అప్‌డేట్ న్యూ అడ్రస్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో కొత్త అడ్రస్ నమోదు చేయాలి. అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేయాలి. అడ్రస్ ప్రూఫ్ స్కాన్ కాపీ అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఆథార్ అప్‌డేట్ రిక్వెస్ట్ రిసీవ్ కావడంతో పాటే 14 నెంబర్ల అప్‌డేట్ రిక్వెస్ట్ లభిస్తుంది. 

Also read: Reliance Jio Plans: నెల నెలా రీఛార్జ్ అవసరం లేని రిలయన్స్ జియో కొత్త ప్లాన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News