Aadhaar Update: గుడ్‌న్యూస్.. ఇంట్లోనే కూర్చొని ఆధార్‌ అప్‌డేట్ చేసుకోండి

Aadhaar Card Address Update: ఆధార్‌లో చిరునామా మార్పుకు సంబంధించి యూఐడీఏఐ నిబంధనలు సవరించింది. ఇక నుంచి ఆన్‌లైన్‌లో ఆధార్‌లో అడ్రస్‌ను సింపుల్‌గా ఛేంజ్‌ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2023, 11:36 AM IST
Aadhaar Update: గుడ్‌న్యూస్.. ఇంట్లోనే కూర్చొని ఆధార్‌ అప్‌డేట్ చేసుకోండి

Aadhaar Card Address Update: ఆధార్ కార్డ్‌లోని అడ్రస్ మొదలైనవాటిని కూడా అప్‌డేట్ చేయాలనుకుంటే మీ సేవా లేదా ఇతర ఆన్‌లైన్ కేంద్రాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇక నుంచి ఇలాంటి కష్టాలకు చెక్ పడనుంది. దీనికి సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కొత్త నిబంధనను రూపొందించింది. యూఐడీఏఐ నివాసితులు తమ కుటుంబ పెద్దల సమ్మతితో ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌లో వారి చిరునామాను అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. కుటుంబ పెద్దతో సంబంధాన్ని చూపించే ఏదైనా పత్రాన్ని సమర్పించడం ద్వారా చిరునామాను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చని యూఐడీఏఐ తెలిపింది.

మీ అడ్రస్‌ను అప్‌డేట్ చేయాడానికి మీరు రేషన్ కార్డ్, మార్క్ షీట్, వివాహ ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ మొదలైనవాటిని పత్రాలుగా ఉపయోగించవచ్చు. ఈ పత్రాలపై కుటుంబ పెద్ద, ఆ వ్యక్తి ఇద్దరి పేరు, రిలేషన్ రాయాలి. ఈ పత్రాలు లేని వారు కుటుంబ పెద్ద సూచించిన ఫార్మాట్‌లో ఇచ్చిన స్వీయ డిక్లరేషన్‌ను కూడా సమర్పించవచ్చని యూఐడీఏఐ సూచించింది.

ఆన్‌లైన్‌లో ఆధార్‌లో చిరునామాను అప్‌డేట్‌ సౌకర్యం లక్షలాది మందికి ఉపయోగపడనుంది. ప్రజలు వివిధ కారణాల వల్ల నగరాలు, పట్టణాలను మారుస్తూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

ఆధార్‌లో నమోదు చేసిన అడ్రస్‌ను అప్‌డేట్ చేసే కొత్త సదుపాయం ఇప్పటికే జారీ చేసిన సదుపాయానికి భిన్నంగా ఉంటుంది. చెల్లుబాటు అయ్యే పత్రాల ఆధారంగా చిరునామాను అప్‌డేట్ చేసే సదుపాయాన్ని యూఐడీఏఐ ఇప్పటికే అందిస్తోంది. 18 ఏళ్లు పైబడిన ఏ వ్యక్తినైనా కుటుంబ పెద్దగా పరిగణించవచ్చని.. అతను తన చిరునామాను ఇతర కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చని కూడా యూఐడీఏఐ తెలిపింది. 'మై ఆధార్' పోర్టల్‌ను సందర్శించడం ద్వారా చిరునామాను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇందుకు రూ.50 ఫీజుగా నిర్ణయించారు.

Also Read: IT Raids: హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ సోదాలు కలకలం.. ఏకంగా 20 బృందాలు రంగంలోకి..  

Also Read: AP Politics: ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీతో గుబులు.. ఎవరికి నష్టం..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News