Twitter Logo Replacement: ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో లోగో నుంచి పక్షి మాయమవుతున్నట్లు ప్రటించారు. పిట్ట స్థానంలో X అనే అక్షరాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ట్విట్టర్‌ను సరికొత్తగా ఏర్పాటు చేసిన ఎక్స్ కార్ప్ అనే కంపెనీలో విలీనం చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ఎలాన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో X లోగోను ఆయన ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. లోగో మార్పు విషయాన్ని ఆదివారం ట్విట్టర్‌లో వీడియో రూపంలో వెల్లడించారు.
"త్వరలో మేము ట్విట్టర్ బ్రాండ్‌కు.. నెమ్మదిగా అన్ని పక్షులకు వీడ్కోలు పలుకుతాం. ఈ రాత్రి X లోగో బాగుంటే.. మేము రేపు ప్రపంచవ్యాప్తంగా లైవ్‌లోకి తీసుకువస్తాం.." అని ఎలన్ మస్క్ తెలిపారు. గతేడాది ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన మస్క్.. క్రమంగా సమూల మార్పులు చేస్తున్నారు. మొదట సంస్థలో ఉద్యోగులకు ఉద్వాసన పలకగా.. తరువాత సబ్‌స్క్రిప్షన్ విధానాన్ని తీసుకువచ్చారు. టెక్ట్స్ విషయంలోనూ మార్పులు చేశారు. ఇటీవల పోస్టులు చూసే విషయంలోనూ లిమిట్ సెట్ చేస్తూ మస్క్ నిర్ణయం తీసుకున్నారు.
— Elon Musk (@elonmusk) July 23, 2023
గతంలోనే ట్విట్టర్ లోగోలో పక్షి స్థానంలో డాగ్ ఇమేజ్‌ను ఎలన్ మాస్క్ తీసుకువచ్చారు. క్రిప్టోకరెన్సీలో ఒకటైన డోజ్‌కాయిన్ లోగోగా వినియోగించే ఒక కుక్క ఫొటోను లోగోగా పరిచయం చేశారు. వినియోగదారులు ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేసి.. రీఫ్రెష్ చేయగానే కొత్త లోగో కనిపించింది. డోజ్ కాయిన్ డాగ్ లోగోను మస్క్ ఒకటి రెండు సందర్భాల్లో వినియోగించి వెనక్కి తీసుకున్నారు. డాగ్ ప్లేస్‌లో మళ్లీ బ్లూ బర్డ్‌ను తీసుకువచ్చారు.
తాజాగా మరోసారి లోగో మార్పు అంశం తెరపైకి తీసుకువచ్చారు. ఎలన్ మస్క్ X అనే అక్షరాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఈ నేపథ్యంలోనే X లోగోను ఆయన ప్రతిపాదించారు. భవిష్యత్‌లో మరిన్ని మార్పులకు మస్క్ ప్లాన్ చేస్తున్నారు. ట్విట్టర్‌కు పోటీగా థ్రెడ్స్ యాప్ రావడంతో వినియోగదారులు ఎక్కువ మంది ఆ యాప్‌కు మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే.
Also Read: Anakapalle Child Death: చిన్నారిని గరిటెతో కొట్టిన తల్లి.. 16 నెలల పసికందు మృతి
Also Read: Credit Card Rules: ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. పెరిగిన ఛార్జీలు ఇలా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి