Twitter Logo Change Effect to Elon Musk: ఎలాన్ మస్క్ ట్విట్టర్ విషయంలో తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ అవాక్కయ్యారు. చాలామందికి ఈ నిర్ణయం నచ్చలేదు. అందుకే గత 24 గంటల్లో ఎలాన్ మస్క్ నెట్‌వర్త్ భారీగా క్షీణించింది. ఒక్క ఉదుపులో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. పూర్తి వివరాలు మీ కోసం..
ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను చేజిక్కించుకున్న తరువాత నిరంతరం మార్పులు చేస్తూ వస్తున్నారు. ముందు పెద్దమొత్తంలో ఉద్యోగుల తొలగింపు, తరువాత సబ్‌స్క్రిప్షన్ ఉచితం చేయడం ఇప్పుడు ఏకంగా లోగోనే మార్చడం. ట్విట్టర్ సింబల్ అంటే ప్రపంచమంతా పరిచయం. పక్షి గుర్తు ఉంటుంది. ఈ గుర్తు చూస్తే చాలు ట్విట్టర్ అని వెంటనే తెలిసిపోతుంది. అంత ప్రాచుర్యం పొందిన గుర్తును ఎలాన్ మస్క్ ఒక్కసారిగా మార్చేశాడు. ఆ గుర్తు తొలగించి..కుక్క బొమ్మను లోగో చేశాడు. ఎలాన్ మస్క్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంపై అందరూ అవాక్కయ్యారు. చాలామందికి ఈ నిర్ణయం ఏ మాత్రం నచ్చలేదు. బహుశా అందుకే 24 గంటల్లోనే ఎలాన్ మస్క్ నెట్‌వర్క్ సంపద భారీగా క్షీణించింది.
ట్విట్టర్ లోగో మార్చగానే ఎలాన్ మస్క్‌కు షాక్ తగిలింది. ఎలాన్ మస్క్ ఏప్రిల్ 4 నుంచి లోగో మార్చాడు. ఈ మార్పులో భాగంగా ట్విట్టర్ బ్లూ బర్డ్ స్థానంలో డాగీని పెట్టాడు. ఈ నిర్ణయంతో టెస్లా షేర్లలో కూడా భారీగా క్షీణత కన్పించింది. టెస్లా షేర్లు వరుసగా రెండవరోజు కూడా క్షీణించసాగాయి. బుధవారం నాడు టెస్లా షేర్ 2.19 డాలర్లు తగ్గి..192.58 యూఎస్ డాలర్లకు చేరుకుంది.
Also Read: PNG CNG Gas Price: 10% వరకు తగ్గనున్న పీఎన్‌జీ-సీఎన్‌జీ గ్యాస్ ధరలు.. కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
రెండ్రోజుల్లో 8.5 లక్షల కోట్లు ఆవిరి
షేర్లలో వచ్చిన భారీ తగ్గుదల ప్రభావం ఎలాన్ మస్క్ నెట్‌వర్క్ సంపదపై పడింది. ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్ టైమ్ బిలియనీర్ ఇండెక్స్‌లో మస్క్ నెట్‌వర్క్ 1.4 బిలియన్ డాలర్ల క్షీణతతో 192.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత రెండ్రోజుల్లో మస్క్ నెట్‌వర్త్‌లో 10.04 శాతం తగ్గుదల నమోదైంది. టెస్లా షెర్లలో తగ్గుదల నమోదయ్యే సమయానికి కంపెనీ సేల్స్ అండ్ ప్రోడక్షన్ రిపోర్ట్ విడుదలవుతోంది.
ప్రపంచ కుబేరుల్లో రెండవ వ్యక్తి
దాదాపు 8.5 లక్షల కోట్ల సంపద క్షీణించినా ఎలాన్ మస్క్ ఇంకా ప్రపంచ కుబేరుల జాబితాలో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. మస్స్ మొత్తం సంపద 192.8 బిలియన్ డాలర్లుగా ఉంది. మస్క్ తరువాత మూడవ స్థానంలో 127 బిలియన్ డాలర్లతో జెఫ్ బెజోస్ ఉన్నాడు. 228.1 బిలియన్ డాలర్లతో బెర్నార్డ్ ఆర్నాల్డ్ అండ్ ఫ్యామిటీ మొదటి స్థానంలో నిలిచింది.
ఇక బ్లూమ్‌బర్గ్ రియల్ టైమ్ బిలియనీర్ ఇండెక్స్‌లో కూడా ఎలాన్ మస్క్ నెట్‌వర్త్‌లో భారీగా క్షీణత కన్పించింది. ఎలాన్ మస్క్ సంపద పడిపోయి 176 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో కూడా ఎలాన్ మస్క్ నెట్‌వర్త్ 1.42 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది.
Also Read: Business Ideas: జీరో ఇన్వెస్ట్‌తో ఇలా ప్రతి రోజు రూ. 1000 దాకా సంపాదించవచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook