Best Recharge Plans: త్వరలో టెలీకం కంపెనీల కొత్త ప్లాన్స్, ఇకపై కేవలం వాయిస్ కాలింగ్ వోచర్లు

Best Recharge Plans: టెలీకం వినియోగదారుల సౌకర్యం కోసం ట్రాయ్ ఎప్పటికప్పుడు టెలీకం కంపెనీలకు ఆంక్షలు, ఆదేశాలు జారీ చేస్తుంటుంది. టెలీకం కంపెనీల గుత్తాధిపత్యాన్ని తగ్గించే నిర్ణయాలు తరచూ కాకపోయినా అప్పుడప్పుడూ వెలువడుతుంటాయి. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 27, 2024, 07:26 PM IST
Best Recharge Plans: త్వరలో టెలీకం కంపెనీల కొత్త ప్లాన్స్, ఇకపై కేవలం వాయిస్ కాలింగ్ వోచర్లు

Best Recharge Plans: దేశంలోని టెలీకం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్..అన్ని టెలీకం కంపెనీలపై ఆజమాయిషీ కలిగి ఉంటుంది. ట్రాయ్ నిబంధనల ప్రకారమే ఏ టెలీకం కంపెనీ అయినా నడుచుకోవల్సి ఉంటుంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ అన్నీ ట్రాయ్ పర్యవేక్షణలోనే ఉంటాయి. 

మొబైల్ వినియోగదారుల సౌకర్యార్ధం ట్రాయ్ కొత్తగా దేశంలోని టెలీకం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా వాయిస్ కాల్, ఎస్ఎంఎస్ సేవల కోసం ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెట్టాలని దేశంలోని బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలను ఆదేశించింది. ఇది అమల్లోకి వస్తే ప్రతి వినియోగదారుడికి చాలా వరకూ డబ్బులు ఆదా అవుతాయి. అంటే ఇకపై ఈ కంపెనీలు కేవలం వాయిస్ కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ వోచర్లు కూడా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. వృద్ధులకు, ఫీచర్ ఫోన్లు వాడేవారికి, డేటా అవసరం అంతగా లేనివారికి లేదా డ్యూయల్ సిమ్ ఉపయోగించేవారికి ట్రాయ్ ఆదేశాలు చాలా ప్రయోజనం కల్గిస్తాయి. 

ఎందుకంటే ప్రస్తుతం ఏ టెలీకం కంపెనీ టారిఫ్ ప్లాన్ చూసినా వాయిస్ కాల్, ఎస్ఎంఎస్, డేటాతో కలిపే ఉంటున్నాయి. చాలామందికి డేటా అవసరం ఉండకపోవచ్చు. కేవలం వాయిస్ కాలింగ్ మాత్రమే ఉండవచ్చు. కొంతమందికి కేవలం ఎస్ఎంఎస్ సౌకర్యం ఉంటే సరిపోతుంది.  అయినా సరే ఏ ఒక్క ఫీచర్‌తో ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్స్ లేకపోవడంతో డేటాతో ఉన్న ప్లాన్స్ ఎక్కువ డబ్బులు వెచ్చించి తీసుకుంటున్నారు. ఇంకొంతమంది డ్యూయల్ సిమ్ రూపంలో స్టాండ్ బై సిమ్ వాడుతుంటారు. ఈ సిమ్ పెద్గగా వాడకున్నా ప్రతి నెలా తప్పనిసరిగా వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్, డేటా కలిపి ఉన్న ప్లాన్ రీఛార్జ్ చేయించుకోవల్సి వస్తోంది. 

కేవలం వాయిస్ కాలింగ్ లేదా కేవలం ఎస్ఎంఎంస్ కోసం రీఛార్జ్ ప్లాన్స్ లేకపోవడంతో వినియోగదారుడికి భారమౌతున్నాయి. అందుకే ట్రాయ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై కేవలం వాయిస్ కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ కోసం ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్స్ అందించాల్సి ఉంటుంది. 

Also read: Big Gift for Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బహుమతి, ఇకపై వేతన సంఘం స్థానంలో కొత్త విధానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News