Gold Rate Today In Hyderabad: భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఎగసిన వెండి ధర

Gold Rate Today In Hyderabad on 28th October 2020 | బంగారం ధరలు (Gold Rate Today) భారీగా పెరిగాయి. పసిడి దారిలోనే వెండి ధరలు పయనించాయి. అయితే ముడి చమురుతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి.

Last Updated : Oct 28, 2020, 06:34 AM IST
  • బులియన్ మార్కెట్‌లో భారీగా పెరిగిన బంగారం ధరలు
  • మార్కెట్‌లో తాజాగా పసిడి దారిలోనే పయనించిన వెండి ధరలు
  • రూ.600 మేర పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.62,100 అయింది
Gold Rate Today In Hyderabad: భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఎగసిన వెండి ధర

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) భారీగా పెరిగాయి. పసిడి దారిలోనే వెండి ధరలు పయనించాయి. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో తాజాగా బంగారం ధర రూ.810 మేర భారీగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,220కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.740 పెరగడంతో ధర రూ.47,8700 అయింది.

 

గత నాలుగు రోజులుగా ఢిల్లీ మార్కెట్‌లో తగ్గుతున్న బంగారం ధరలు (Gold Rate in Delhi) తాజాగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.210 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.53,100కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.200 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.49,600 వద్ద మార్కెట్ అవుతోంది.

 

గత వారం రోజులుగా బులియన్ మార్కెట్‌లో తగ్గుతూ వస్తున్న వెండి ధరలు (Silver Rate in India) మళ్లీ పెరిగాయి. నిన్న రూ.1000 మేర దిగొచ్చిన వెండి ధర తాజాగా పెరిగింది. రూ.600 మేర పెరగడంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.62,100కి చేరుకుంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News