Gold Rate Today in Hyderabad: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

Gold Rate Today In India | బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ముడి చమురు, అమెరికన్ డాలర్లతో పాటు బంగారం, వెండి ధరలపై పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు ప్రభావం చూపుతాయి.

Last Updated : Oct 26, 2020, 07:44 AM IST
  • బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
  • కరోనా వ్యాప్తి సమయంలో నేడు వెండి ధరలు యథాతథం
  • గత రెండు రోజులుగా 1 కేజీ వెండి ధర రూ.62,500 వద్ద మార్కెట్ అవుతోంది
Gold Rate Today in Hyderabad: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా పెరిగాయి. అదే సమయంలో వెండి ధరలలో ఏ మార్పు లేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో తాజాగా బంగారం ధర రూ.240 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,510కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.220 పెరగడంతో ధర రూ.47,220 అయింది.

 

గత కొన్ని రోజులుగా ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi) స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములపై రూ.110 మేర తగ్గడంతో ధర రూ.52,890 అయింది. ప్రస్తుతం అదే ధరలో మార్కెట్ అవుతోంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,400గా స్థిరంగా కొనసాగుతోంది.

 

గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో తగ్గుతూ వస్తున్న వెండి ధరలు (Silver Rate in India) తాజాగా యథాతథంగా ఉన్నాయి. గత రెండు రోజులుగా 1 కేజీ వెండి ధర రూ.62,500 వద్ద మార్కెట్ అవుతోంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో మార్కెట్ అవుతుంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News