Buying New AC: కొత్త ఏసీ కొంటున్నారా ? ఇవి చెక్ చేయడం మర్చిపోవద్దు

Buying New AC, which kind of AC is better: ఏసీ కొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా ? మీ అవసరాలకు అనుగుణంగా ఎలాంటి ఏసీ అయితే బాగుంటుందో మీకు ఐడియా ఉందా ? పొరపాటున ఏసీ కొని ఆ తరువాత తమ పర్పస్ నెరవేరలేదే అని ఫీలవుతున్నారా ? అయితే, ఏసీ కొనడానికి ముందే తెలుసుకోవాల్సిన ఈ ముఖ్యమైన విషయాలపై ఓ లుక్కేయండి.

Written by - Pavan | Last Updated : May 15, 2023, 11:20 PM IST
Buying New AC: కొత్త ఏసీ కొంటున్నారా ? ఇవి చెక్ చేయడం మర్చిపోవద్దు

Buying New AC, which kind of AC is better: ఏసీ కొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా ? మీ అవసరాలకు అనుగుణంగా ఎలాంటి ఏసీ అయితే బాగుంటుందో మీకు ఐడియా ఉందా ? పొరపాటున ఏసీ కొని ఆ తరువాత తమ పర్పస్ నెరవేరలేదే అని ఫీలవుతున్నారా ? అయితే, ఏసీ కొనడానికి ముందే తెలుసుకోవాల్సిన ఈ ముఖ్యమైన విషయాలపై ఓ లుక్కేయండి.  

1) బడ్జెట్ ప్లానింగ్ :
వేసవి తాపం తట్టుకోలేకపోతున్నారా ? ఏసీ కొనేందురు ప్లాన్ చేస్తున్నారా ? అయితే, ముందుగా మీరు ఎంత బడ్జెట్ పెట్టాలనుకుంటున్నారో డిసైడ్ అవండి. ఆ ప్రకారం ఎన్ని ఫీచర్స్ ఉన్న ఏసీ కొనుగోలు చేయొచ్చు లేదంటే.. ఎంతలో సర్దుకుపోవచ్చు అనేది తెలుస్తుంది. 

2) రూమ్ సైజ్ ముఖ్యం - ఏసీ కెపాసిటీ : 
ఏసీ బిగించే రూమ్ చల్లబడాలంటే టైమ్ పట్టుద్ది కాబట్టి మీరు ఏసి ఉపయోగిస్తున్న రూమ్ ఎంత పెద్దది అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ గది విశాలమైనది అయితే, ఏసీ ఎక్కువ కెపాసిటీ అయ్యుండాలి. చిన్న గది అయితే తక్కువ కెపాసిటీ ఉన్నా సరిపోతుంది.

3) ఏ అంతస్తులో ఉంటున్నారో దాన్ని బట్టి ఏసీ కెపాసిటీ ఎంచుకోవాలి :
ఒకవేళ మీరు నివాసం ఉండే ఫ్లాట్ బిల్డింగ్‌ పై అంతస్తులో ఉన్నట్టయితే, ఎండవేడి ఎక్కువగా ఉంటుంది. ఆ ఉక్కపోతను చలబర్చాలంటే.. ఎక్కువ కెపాసిటీ ఉన్న ఏసీ అవసరం ఉంటుంది. అలా కాకుండా కింది అంతస్తుల్లో ఉన్న ఫ్లాట్ అయితే, అంత ఎక్కువ కెపాసిటీ అవసరం లేదు.   

4) ఇంట్లో ఎంతమంది ఉంటారు ?
ఇంట్లో ఎంత మంది ఉంటారనే దానిని బట్టి ఏసీ వినియోగం ఆధారపడి ఉంటుంది. శాస్త్రీయంగా ఎక్కువ రద్దీ ఉండే చోటు చల్లబడటానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాంటప్పుడు ఎక్కువ కెపాసిటీ ఉండే పెద్ద ఏసీ అయితేనే తక్కువ వ్యవధిలోనూ ఇల్లు చల్లగా మారుతుంది. 

5) స్ప్లిట్ ఏసీ బెటరా లేక విండో ఏసీ బెటరా ?
శక్తి, సామర్థ్యాల పరంగా స్ప్లిట్ ఏసీ, విండో ఏసీలు రెండూ సమానమే. అయితే, స్ప్లిట్ ఏసీతో పోల్చుకుంటే, విండో ఏసీ ధర తక్కువ. స్ప్లిట్ ఏసీ ధర ఎక్కువే అయినప్పటికీ.. అందులో ఉండే ఫీచర్స్ కూడా అంతే ఎక్కువ. అలాగే విండో ఏసీ అయితే, ఏసీ యూనిట్ కి సరిపోయే విధంగా విండో కొలతలు ఉండాలి. విండో కొలతలకు అనుగుణంగా ఏసీ యూనిట్ ఎంచుకోవాలి లేదంటే ఫిక్సింగ్ లో పలు సవాళ్లు ఎదురవుతాయి. 

6) కాపర్ కాయిల్ ఏసీలు :
అల్యూమినియం కాయిల్ తో పోల్చుకుంటే.. కాపర్ కాయిల్ ఏసీలు త్వరగా చల్లబడేలా చేస్తాయి. అంతేకాకుండా కాపర్ కాయిల్ ఏసీలు ఎక్కువ కాలం మన్నిక ఇస్తాయి. 

7) స్టార్స్ చూడటం మర్చిపోవద్దు :
4 లేదా 5 స్టార్ ఏసీలు వినియోగంలో ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు. అలాగే విద్యుత్ వినియోగం కూడా తక్కువగా ఉంటుంది. తక్కువ ధరలో వస్తుంది కదా అని తక్కువ స్టార్స్ ఉన్న ఏసీ యూనిట్ తీసుకుంటే.. దీర్ఘ కాలంలో ఆ ఏసీ యూనిట్ మెయింటెనెన్స్ ఎక్కువే అవుతుంది. బడ్జెట్ ఎక్కువగా లేదనుకుంటే.. కనీసంలో కనీసం 3 స్టార్స్ ఉన్న ఏసీని ఎంచుకోవాలి.

8) విద్యుత్ బిల్లు తగ్గించే ఇన్‌వర్టర్ ఏసీలు :
రెగ్యులర్ ఏసీ యూనిట్స్ తో పోల్చుకుంటే.. ఇన్‌వర్టర్ ఏసీలతో విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది. ఫలితంగా విద్యుత్ బిల్లు కూడా తగ్గించుకునేందుకు అవకాశం ఉంది. 

9) స్మార్ట్ ఫీచర్స్ కోసం ఎక్కువ తగలెయ్యొద్దు -  వైఫై ఎనేబుల్డ్ ఏసీలు :
ఇటీవల కాలంలో వైఫై సౌకర్యం ఉండే ఏసీ యూనిట్స్ వినియోగమే ఎక్కువైంది. కానీ వాటి ధర కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్కువ బడ్జెట్ లేదునుకుంటే.. వైఫై ఎనేబుల్డ్ ఏసీ ఎంచుకోకపోయినా పెద్దగా తేడా ఉండదు. అంతేకాకుండా ఎలాంటి ఏసీనైనా వైఫై-ఎనేబుల్డ్ ఐఆర్ సెన్సార్ సహాయంతో స్మార్ట్ ఏసీగా మార్చుకోవచ్చు. అందుకోసం కేవలం రూ. 800 నుంచి రూ. 1200 వరకు ఖర్చు అవుతుంది. అంతే..

10) అదనపు సౌకర్యాలు : 
బిల్డ్-ఇన్ హీటర్, ఎయిర్ ప్యూరిఫయర్ లాంటి అడిషనల్ ఫీచర్స్ చూడ్డానికి స్మార్టుగా అనిపించినప్పటికీ.. అవి అంత తప్పనిసరేం కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. బడ్జెట్ ఎక్కువగా ఉంటేనే ఇలాంటి ఫీచర్స్ ఉన్న ఏసీ యూనిట్స్ ఎంచుకోవాలి.

Trending News