Tech Mahindra: డిజిటల్ రంగంలో సరికొత్త అధ్యాయం.. టెక్ మహీంద్రాతో జతకట్టిన మైక్రోసాఫ్ట్‌

Tech Mahindra Ties Up With Microsoft:  టెలికాం ఆపరేటర్‌ల కోసం క్లౌడ్ పవర్డ్ 5జీ కోర్ నెట్‌వర్క్ ఆధునీకరణ కోసం టెక్ మహీంద్రా, మైక్రోసాఫ్ట్ చేతులు కలిపాయి. 5జీ కోర్ వినియోగాన్ని అభివృద్ధి చేయడానికి కలిసి పనిచేస్తున్నట్లు ఈ కంపెనీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2023, 03:00 PM IST
Tech Mahindra: డిజిటల్ రంగంలో సరికొత్త అధ్యాయం.. టెక్ మహీంద్రాతో జతకట్టిన మైక్రోసాఫ్ట్‌

Tech Mahindra Ties Up With Microsoft: డిజిటల్ రంగంలో సరికొత్త విప్లవం చోటు చేసుకోబోతుంది. ప్రముఖ కంపెనీలు టెక్ మహీంద్రా, మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా టెలికాం ఆపరేటర్‌ల కోసం క్లౌడ్ పవర్డ్ 5జీ కోర్ నెట్‌వర్క్ ఆధునీకరణను ప్రారంభించడానికి చేతులు కలిపాయి. 5జీ కోర్ నెట్‌వర్క్ పరివర్తన టెలికాం ఆపరేటర్‌లకు 5జీ కోర్ వినియోగాన్ని అభివృద్ధి చేయడానికి కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించాయి. పెరుగుతున్న సాంకేతిక (ఆగ్‌మెంటెడ్ రియాలిటీ), వర్చువల్ రియాలిటీ (VR), IoT (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), ఎడ్జ్ కంప్యూటింగ్ అవసరాలను తీర్చడంలో సహాయపడుతుందని తెలిపాయి. వ్యాపార కార్యకలాపాలను ఆధునీకరించడానికి, ఆప్టిమైజ్ చేయడానికి, తక్కువ ఖర్చుతో వేగంగా గ్రీన్‌ నెట్ వర్క్‌ను డెవలప్ చేసేందుకు రెడీ అవుతున్నారు. 

రెండు కంపెనీల ఒప్పందలో భాగంగా.. టెక్ మహీంద్రా వారి 5జీ కోర్ నెట్‌వర్క్‌ల కోసం టెలికాం ఆపరేటర్‌లకు తన ప్రతిభ నైపుణ్యం, సమగ్ర పరిష్కారాలు, నెట్‌వర్క్ క్లౌడ్‌ఫికేషన్ యాజ్ ఏ సర్వీస్, AIOps వంటి మేనేజ్‌డ్ సేవలను అందిస్తుంది. AIOps ద్వారా ఆధారితమైన నెట్‌వర్క్ కోర్ సిస్టమ్‌లు, కార్యకలాపాల ఆధునీకరణ ఆపరేటర్‌లు వారి 5జీ కోర్ నెట్‌వర్క్‌లను అమలు చేయడానికి, క్లౌడ్  శక్తిని వారి కస్టమర్‌లకు త్వరగా, సులభంగా అందించడానికి వీలు కల్పిస్తుంది. తప్పులను సరిదిద్దడం, పనితీరు సమస్యలను అంచనా వేయడం.. తద్వారా స్వీయ సేవలందించే నెట్‌వర్క్ కార్యకలాపాలను ప్రారంభించడం వంటి నెట్‌వర్క్ కార్యకలాపాల ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి, మెషీన్ లెర్నింగ్‌ను కలపడానికి ఆపరేటర్‌లకు AIOps సహాయం చేస్తుంది.

టెక్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీపీ గుర్నానీ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్‌లకు సంబంధిత సేవలు, పరిష్కారాలను రూపొందించడానికి నెక్స్ట్-జెన్ టెక్నాలజీలను ఉపయోగించడం చాలా కీలకమన్నారు. టెక్ మహీంద్రాలో టెలికాం ఆపరేటర్‌లు తమ నెట్‌వర్క్‌ల పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడంలో, వారి కస్టమర్‌లకు వారి ఈఎస్‌జీ కమిట్‌మెంట్స్ అందివ్వడానికి ఉపయోగపడుతుందన్నారు. మైక్రోసాఫ్ట్‌తో తమ సహకారం మైక్రోసాఫ్ట్ క్లౌడ్‌తో టెలికాం పరిశ్రమలో తమ సేవా పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఈ సహకారంతో పాటు క్లౌడ్ టెక్నాలజీల శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా గ్రీన్, సురక్షితమైన నెట్‌వర్క్‌లను నిర్మించడానికి టెలికాం ఆపరేటర్‌లు తమ కార్యకలాపాలను సరళీకృతం చేయడం, మార్చుకోవడంలో సహాయపడటానికి టెక్ మహీంద్రా, మైక్రోసాఫ్ట్ కలిసి పని చేస్తాయని చెప్పారు.

మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి మాట్లాడుతూ.. అజూర్ ఆపరేటర్లకు క్లౌడ్ సొల్యూషన్‌లను అందజేస్తుందన్నారు. ఇది కొత్త ఆదాయాన్ని సృష్టించే సేవలను సృష్టించడానికి, ఇప్పటికే ఉన్న సేవలను క్లౌడ్‌కి తరలించడానికి వీలు కల్పిస్తుందని తెలిపారు. టెక్ మహీంద్రాతో తమ సహకారం ద్వారా మైక్రోసాఫ్ట్ టెలికోలకు సవాళ్లను అధిగమించడానికి, ఆవిష్కరణలను ముందుకు నడపడానికి, గ్రీన్, సురక్షిత నెట్‌వర్క్‌లను రూపొందించడంలో మరింత సహాయపడుతుందని పేర్కొన్నారు.

ఈ భాగస్వామ్యం టెక్ మహీంద్రా NXT.NOWTM ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా ఉంది. ఇది మానవ కేంద్రీకృత అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఉండడంతో పాటు డిజిటల్ పరివర్తనను ప్రారంభించనుంది. కస్టమర్ల అవసరాలను అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను ఉపయోగించి పరిష్కార మార్గాలను చూపించడంపై దృష్టి పెడుతుంది.

Also Read: Ind Vs SL: సిరీస్‌ విజయంపై భారత్ కన్ను.. ఆ ప్లేయర్‌ను ఆపితేనే..!  

Also Read:  India vs Sri Lanka: విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మధ్య విభేదాలు.. నెట్టింట వీడియో వైరల్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News