IT Warning: ట్యాక్స్ పేయర్లు మే 31లోగా ఆ పని చేయకుంటే రెట్టింపు టీడీఎస్ కట్

IT Warning: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయం ఆసన్నమైంది. ఉద్యోగులు ఫామ్ 16  చేతికి అందగానే రిటర్న్స్ ఫైల్ చేసే ప్రక్రియ ప్రారంభిస్తారు. ఈ నేపధ్యంలో ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. మే నెలాఖరులోగా ఆ పని పూర్తి చేయకుంటే అదనపు ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 28, 2024, 06:01 PM IST
IT Warning: ట్యాక్స్ పేయర్లు మే 31లోగా ఆ పని చేయకుంటే రెట్టింపు టీడీఎస్ కట్

IT Warning: ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి అలర్ట్ మెస్సేజ్ ఇది. ఆధార్ కార్డుతో పాన్‌కార్డు అనుసంధానం చేయకుంటే టీడీఎస్ రెట్టింపు కట్ చేస్తామని ఇన్‌కంటాక్స్ శాఖ హెచ్చరించింది. మే 31 వరకూ పాన్‌కార్డు-ఆధార్ కార్డు లింకింగ్‌కు గడువు ఇచ్చింది. అంటే మరో మూడ్రోజులే మిగిలుంది. 

పాన్‌కార్డును ఆధార్ కార్డులో అనుసంధానం చేయమని ఇన్‌కంటాక్స్ శాఖ పదే పదే స్పష్టం చేస్తోంది. ఇప్పటికే చాలా గడువులు పూర్తయ్యాయి. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయం కావడంతో మరోసారి అప్రమత్తం చేసింది. ట్యాక్స్ పేయర్లకు మెస్సేజ్ జారీ చేసింది. మే 31లోగా పాన్‌కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించకుంటే టీడీఎస్ రెట్టింపు కట్ అవుతుందని స్పష్టం చేసింది. ఇన్‌కంటాక్స్ శాఖ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ ఆధార్ కార్డుతో పాన్‌కార్డును తప్పకుండా లింక్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఉద్యోగుల జీతం నుంచి కట్ అయ్యే టీడీఎస్ రెట్టింపు కట్ కాగలదు. దీనికి సంబంధించి ఇన్‌కంటాక్స్ శాఖ గత నెలలో ఓ సర్క్యులర్ కూడా జారీ చేసింది. మే 31లోగా పాన్‌కార్డు-ఆధార్ కార్డు లింకింగ్ పూర్తి చేస్తే టీడీఎస్ తక్కువ కట్ అవుతుందని లేకపోతే ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని తెలిపింది. ఎక్స్ వేదికపై కూడా ఇన్‌కంటాక్స్ శాఖ ఇదే విషయాన్ని షేర్ చేసింది. ఇప్పటికే చాలాసార్లు పాన్‌కార్డు- ఆధార్ కార్డు అనుసంధానంపై అప్‌డేట్స్ ఇస్తూ వస్తోంది. ఇప్పుడు మరోసారి మే 31 వరకూ గడువు ఇచ్చింది. 

మరోవైపు బ్యాంకులు, ఫారెక్స్ డీలర్లకు కూడా ఐటీ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మే 31 నాటికి ఆర్దిక లావాదేవీల స్టేట్‌మెంట్స్ సమర్పించాలని బ్యాంకులు, ఫారెక్స్ డీలర్లకు సూచించింది. అలా చేయకుంటే జరిమానా విధిస్తామని తెలిపింది. ఈ స్టేట్‌మెంట్స్ ద్వారా ఎవరైనా వ్యక్తి పెద్దమొత్తంలో చేసే లావాదేవీలపై ఐటీ శాఖ దృష్టి సారిస్తుంది. విదేశీ ఎక్స్చేంజ్ డీలర్లు, బ్యాంకులు, సబ్ రిజిస్ట్రార్‌లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు, పోస్టాఫీసులు, బాండ్ జారీ చేసే సంస్థలు, మ్యూచ్యువల్ ఫండ్స్ ట్రస్టీలు, డివిడెండ్ చెల్లించే కంపెనీలన్నీ ఈ స్టేట్‌మెంట్స్ షేర్ చేయాల్సి ఉంటుంది. 

మే 31 నాటికి ఫైనాన్షియల్ లావాదేవీల స్టేట్‌మెంట్స్ ఫైల్ చేయకపోతే రోజుకు 1000 రూపాయల చొప్పున పెనాల్టీ ఉంటుంది. తప్పుడు సమాచారం ఇచ్చినా లేక ఫైల్ చేయకపోయినా అదనపు జరిమానా కూడా ఉంటుందని ఇన్‌‌కంటాక్స్ శాఖ వెల్లడించింది. అందుకే తక్షణం మే 31 తేదీలోగా అంటే మరో మూడ్రోజుల్లో మీరు ట్యాక్స్ పేయర్ అయితే వెంటనే మీ పాన్‌కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయండి. 

Also read: 7th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్, జూలైలో జీతం, డీఏ రెండూ పెంపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News