Best Selling Hatchbacks Cars: కారు కొనాలని ప్లాన్ చేసే వారిలో చాలామందిని ఎన్నో సందేహాలు వెంటాడుతుంటాయి. హ్యాచ్‌బ్యాక్ కార్లు కొంటే బాగుంటుందా లేక సెడాన్ కార్లు కొంటే బాగుంటుందా అనేది చాలామందికి కలిగే మొదటి సందేహం. ఒకవేళ హ్యాచ్‌బ్యాక్ కారు కొనాలని నిర్ణయించుకుంటే అందులో కూడా ఎలాంటి కారు అయితే బాగుంటుంది అనేది ఆ తరువాతి సందేహం. అలా తికమక పడే వారిలో చాలామంది ముందుగా చెక్ చేసే అంశం ఏంటంటే.. ప్రస్తుతం ఎలాంటి కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయనేది. అలాంటి వారి కోసమే ఇదిగో ఈ డీటేల్స్.
2023 జనవరిలో అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్ కార్ల ఆధారంగా ఎక్కువగా అమ్ముడవుతున్న కార్ల వివరాలు ఏంటో ఇప్పుడు చెక్ చేద్దాం.
1) 2023 జనవరిలో 21,411 మారుతి సుజుకి ఆల్టో కార్లు అమ్ముడయ్యాయి. 2022 జనవరిలో 12,342 మారుతి సుజుకి ఆల్టో కార్లు అమ్ముడు కాగా ఈ ఏడాది ఆ సంఖ్య భారీగా పెరిగింది. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ వాహనాల శ్రేణిలో మారుతి సుజుకి ఆల్టో కార్లు ముందుండం వీటి విక్రయాలు పెరగడానికి కారణమైంది.
2) 2023 జనవరిలో 20,466 మారుతి సుజుకి వ్యాగాన్ ఆర్ కార్లు విక్రయాలు జరిగాయి. గతేడాది ఇదే జనవరి నెలలో మారుతి సుజుకి 20,334 వ్యాగాన్ ఆర్ కార్లను విక్రయించింది. ఏడాది గడిచినప్పటికీ హ్యాచ్‌బ్యాక్ కార్ల అమ్మకాల్లో పోటీ ఇవ్వడంలో వ్యాగాన్ ఆర్ ఇంకా ముందుటం విశేషం.
3) ఇటీవల ఎక్కువగా అమ్ముడైన టాప్ 5 హ్యాచ్‌బ్యాక్ కార్లలో మూడో స్థానం కూడా మారుతి సుజుకి కంపెనీదే. మారుతి సుజుకి నుంచి వచ్చిన స్విఫ్ట్ కార్లు మూడో స్థానం సొంతం చేసుకున్నాయి. 2023 జనవరిలో మారుతి సుజుకి 16,440 స్విఫ్ట్ కార్లు విక్రయించింది. అయితే గతేడాది జనవరి నెలతో పోల్చుకుంటే ఈ కార్ల విక్రయాల్లో కొంత లోటు కనబడుతోంది. 2022 జనవరిలో 19,108 మారుతి సుజుకి స్విఫ్ట్ కార్లు అమ్ముడు కాగా ఈ ఏడాది గ్రాఫ్ కొంత కిందకు పడింది. అయినప్పటికీ మిగతా హ్యాచ్‌బ్యాక్ కార్లతో పోల్చితే స్విఫ్ట్ కార్ల విక్రయాల సంఖ్య ఎక్కువగానే ఉండటం గమనార్హం.
4) గత నెలలో అధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్ కార్లలో మారుతి సుజుకి బాలెనో కారు నాలుగో స్థానంలో నిలిచింది. అవును.. 2023 జనవరిలో 16,357 మారుతి సుజుకి బాలెనో కార్లు అమ్ముడయ్యాయి.
5) 2023 జనవరిలో నమోదైన కార్ల సేల్స్ డేటా ప్రకారం 9,032 టాటా టియాగో కార్లు అమ్ముడయ్యాయి. ఇదే టాటా టియాగో ఎలక్ట్రానిక్ వెహికిల్స్‌కి కూడా భారీ డిమాండ్ కనబడుతోంది. ఎందుకంటే.. తక్కువ ధరలో మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఈవి కార్లలో టాటా టియాగోనే ముందుంది.
ఇది కూడా చదవండి : PM Svanidhi Yojana: ఈ లోన్ తీసుకుంటే నయాపైస వడ్డీ లేదు.. గ్యారెంటీ అసలే లేదు..
ఇది కూడా చదవండి : Small Savings Schemes: బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే ఈ వడ్డీ రేట్లే ఎక్కువ
ఇది కూడా చదవండి : Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డుపై ఫోటో మార్చుకోవడం ఎలా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook