Best Selling Car: మన దేశంలో నంబర్ వన్ కారు ఇదే.. ఎగబడి కొంటున్న జనం

Tata Nexon Price And Features: టాటా నెక్సాన్ కారు అమ్మకాలలో దూసుకుపోతుంది. ఫ్రెండ్లీ బడ్జెట్‌తోపాటు సూపర్ ఫీచర్లు ఉండడంతో ఈ కార్లను కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతున్నారు. గతేడాది డిసెంబర్‌ నెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన కారుగా టాటా నెక్సాన్ నిలిచింది.   

Written by - Ashok Krindinti | Last Updated : Jan 16, 2024, 08:17 PM IST
Best Selling Car: మన దేశంలో నంబర్ వన్ కారు ఇదే.. ఎగబడి కొంటున్న జనం

Tata Nexon Price And Features: మన దేశంలో టాటా నెక్సాన్ కార్లకు భారీ డిమాండ్ నెలకొంది. గతేడాది డిసెంబర్‌లోనే టాటా నెక్సాన్ 15,284 యూనిట్లను విక్రయించింది.  డిసెంబర్ 2023లో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. 2022 డిసెంబర్‌తో పోలిస్తే.. టాటా నెక్సాన్ అమ్మకాలు ఏకంగా 26.81 శాతం పెరగడం విశేషం. సబ్‌కాంపాక్ట్ SUV విభాగంలో టాటా నెక్సాన్ పూర్తిగా ఆధిపత్ చెలాయిస్తోంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోని కార్ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో స్పెషల్ ఫీచర్లతో కస్టమర్లను ఆకర్షిస్తూ నెంబర్ వన్‌గా నిలుస్తోంది. టాటా నెక్సాన్ కారు ప్రారంభ ధర ధర రూ.8.10 లక్షలు ప్రారంభమై.. రూ.15.5 లక్షలకు చేరుకుంది. టాటా నెక్సాన్ ఈవీ ధర రూ.14.7 లక్షల నుంచి రూ.19.9 లక్షల వరకు ఉంది. స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, ఫియర్‌లెస్ అనే నాలుగు ట్రిమ్‌లలో విక్రయాలు జరుగుతున్నాయి.

టాటా నెక్సాన్ కారు ఏడు రంగులలో అందుబాటులో ఉంది. ఫియర్‌లెస్ పర్పుల్, క్రియేటివ్ ఓషన్, ఫ్లేమ్ రెడ్, ప్యూర్ గ్రే, డేటోనా గ్రే, ప్రిస్టైన్ వైట్, కాల్గరీ వైట్ కలర్స్‌లో ఉంది. టాటా నెక్సాన్ కొత్త మోడల్‌ను లాంచ్ చేయడంతో.. విక్రయాలు విపరీతంగా పెరిగాయి. ఎలక్ట్రిక్ వెర్షన్ అందుబాటులోకి వచ్చిన తరువాత కస్టమర్లు మరింత ఎగబడుతున్నారు.

ఈ కారు ఐదుగురు సీటింగ్ సామర్థ్యం ఉంది. 382 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ ఉంది. 208mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడంతో గుంతలో రోడ్డులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ చేయవచ్చు. ఇది రెండు రకాల ఇంజన్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ (120PS/170Nm), 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ (115PS/260Nm) రకాలలో ఉంటుంది. పెట్రోల్ ఇంజన్ నాలుగు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో వస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ AMT, న్యూ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT) వంటి ఫీచర్లు ఉన్నాయి. 

డీజిల్ యూనిట్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ AMTతో మార్కెట్‌లోకి వస్తుంది. నెక్సాన్‌ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల పూర్తి-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటో ఏసీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్, హైట్ అడ్జస్ట్‌మెంట్ చేయగల ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, పాడిల్ షిఫ్టర్‌ల వంటి అనేక ఫీచర్లు టాటా నెక్సాన్ కారులో ఉండడంతో ఎక్కువ మంది కస్టమర్లు ఆకర్షితులవుతున్నారు. అంతేకాకుండా హర్మాన్-కార్డాన్ నుంచి 9-స్పీకర్ల జేబీఎల్ సౌండ్ సిస్టమ్ ఉండడంతో మ్యూజిక్ లవర్స్ ఎంజాయ్ చేయవచ్చు. భద్రతను దృష్టిలో ఉంచుకుని 6 ఎయిర్‌బ్యాగ్‌లు (స్టాండర్డ్) ఉన్నాయి. EBDతో కూడిన ABS, హిల్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

Also Read: MLC Elections 2024: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌.. ఆ ఇద్దరికే ఛాన్స్  

Also Read: CM Revanth Reddy: తెలంగాణకు అరుదైన అవకాశం.. హైదరాబాద్‌​లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సీ4ఐఆర్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News