Tata Altroz iCNG: ఇటీవల జరిగిన ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ ప్రదర్సించిన టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జి అమ్మకాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. సీఎన్జీ మార్కెట్ వాటాలో పట్టుకోసం టాటా మోటార్స్ వివిధ ఆకర్షణీయమైన ఆఫర్లతో సీఎన్జీ వెర్షన్ అమ్మకాల బుకింగ్స్ ప్రారంభించింది.
టాటా మోటార్స్ గతంలో లాంచ్ చేసిన టాటా ఆల్ట్రోజ్‌లో ఇప్పుడు సీఎన్జీ వేరియంట్ వస్తోంది. టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జి పేరుతో బుకింగ్స్ ప్రారంభం కాగా, మే నుంచి కారు డెలివరీలు ప్రారంభమౌతున్నాయి. కేవలం 21 వేలు చెల్లించి టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జి బుకింగ్ చేయవచ్చు. దీనికి సంబంధించి కారు డెలివరీ మే నుంచి ప్రారంభం కావచ్చు. ఇటీవలే టాటా మోటార్స్ సంస్థ మల్టీ పవర్ ట్రెయిన్ స్ట్రాటెజీలో భాగంగా టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జిను సమర్ధవంతంగా పరీక్షించింది. తొలిసారిగా సీఎన్జీ టెక్నాలజీలో రెండు 30 లీటర్ల సిలెండర్లతో వస్తున్న కారు ఇది.
టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జి XE, XM+, XZ, XZ+ వేరియంట్లలో అందుబాటులో రానుంది. ఇందులో ఒపేరా బ్లూ, డౌన్‌టౌన్ రెడ్ ఆర్కేడ్ గ్రే, ఎవెన్సూ వైట్ కలర్స్ ఉన్నాయి. టాటా ఆల్ట్రోజ్ లెదర్ సీట్స్, ఐఆర్ఏ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇది కాకుండా తొలిసారిగా 30 లీటర్ల సీఎన్జీ సిలెండర్లు రెండింటితో అంటే మొత్తం 60 లీటర్ల కెపాసిటీతో వస్తున్నాయి.
సింగిల్ అడ్వాన్స్డ్ ఈసీయు ఇందులో మరో ప్రత్యేకత. పెట్రోల్ నుంచి సీఎన్జీ మోడ్‌కు సులభంగా మరలేలా చేస్తుంది. సీఎన్జీ మోడ్‌లో నేరుగా కారు స్టార్ట్ చేసే అవకాశముంటుంది. వీటితో పాటు థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్, గ్యాస్ లీక్ డిటెక్షన్ వంటి ప్రత్యేకతలున్నాయి.
టాటా ఆల్ట్రోజ్‌లో మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. 1.2 లీటర్ ఎన్ఏ పెట్రోల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో రెండు గేర్ బాక్స్‌లు ఉంటాయి. ఒకటి 5 స్పీడ్ ఎంటీ, రెండవది 6 స్పీడ్ డ్యూల్ క్లచ్ ఆటోమేటిక్ వెర్షన్.
Also read: Easy Earn Money Tips: వేసవిలో ఈ వ్యాపారాలు చేయండి.. మీ ఇంట డబ్బుల వర్షం కురవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook