Maruti Swift 2024 Model Update: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ శుభవార్త మీ కోసమే.. భారత ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి అత్యధికంగా సేల్ చేసిన తమ స్విఫ్ట్ కారును మరో సారి అప్డేట్ వేరియంట్‌లో మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతోంది. ఈ కారును కంపెనీ అనేక రకాల అధునాతన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు సమాచారం. ఇది ప్రీమయం ఎక్స్టర్నల్‌తో పాటు ఇంటీరియల్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అధికారిక సమాచారం ప్రకారం, కంపెనీ ఈ కారును అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇది కొత్త 1.2 లీటర్ Z-సిరీస్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఈ కారు అనేక రకాల ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
కొత్త మారుతి స్విఫ్ట్ పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే..దీని ఇంజన్ రిష్టంగా 82bhp శక్తితో పాటు 182Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని మార్కెట్‌లో టాక్.. అంతేకాకుండా ఈ కారును కంపెనీ CNG వేరియంట్‌లో కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ కారు ఇంజన్‌ను మాన్యువల్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌లో మార్కెట్‌లోకి లాంచ్ కాబోతున్నట్లు సమాచారం. కంపెనీ ఈ కొత్త స్విఫ్ట్‌కు సంబంధించిన ఫీచర్స్, ఇతర వివరాలను అధికారంగా వెల్లడించలేదు.
అనేక మార్పులతో కారు క్యాబిన్ రాబోతోంది:
ఈ కొత్త స్విఫ్ట్ ఇంటీరియర్ విషయానికొస్తే, ఈ కారు 9-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు Apple CarPlay కనెక్టివిటీతో పాటు ఆప్‌డేటేడ్ Android కనెక్టివిటీనితో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్త డిజైన్‌తో డ్యాష్‌బోర్డ్, ADAS టెక్నాలజీతో రాబోతోంది. ఇది మార్కెట్‌లోకి లాంచ్ అయితే, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, టాటా టియాగో కార్లతో పోటీ పడనుంది.
Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్.. పూర్తి వివరాలు ఇవే..
ఫీచర్స్, ఇతర వివరాలు:
మారుతి సుజుకి స్విఫ్ట్‌లో కొత్త LED DRL లైట్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ప్రీమియం అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే కారు సెఫ్టీ కోసం ప్రత్యేకమైన ఫీచర్స్ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. అంతేకాకుండా ఈ స్విఫ్ట్‌లో 360-డిగ్రీ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ కారు ఆకర్శనీయమైన డిజైన్‌తో మార్కెట్‌లోకి రానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి