Theatrical Business : స్టార్ హీరో సినిమా అయినా థియట్రికల్ బిజినెస్ ఇంత తక్కువా?

Star Hero Movies : ఈ మధ్య కాలంలో స్టార్ హీరో సినిమాల కంటే చిన్న హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ హీరోల సినిమాలు కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు కూడా వెనకడుగు వేస్తున్నారు. దానికి ముఖ్య కారణం పెరిగిపోతున్న సినిమా బడ్జెట్ మరియు ఆకాశాన్ని అంటుతున్న థియట్రికల్ డీల్స్ అని వార్తలు వినిపిస్తున్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2023, 04:11 PM IST
Theatrical Business : స్టార్ హీరో సినిమా అయినా థియట్రికల్ బిజినెస్ ఇంత తక్కువా?

Theatrical Business : ఈ మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో థియట్రికల్ బిజినెస్ విషయంలో పెను మార్పులు సంభవించాయి. దానికి కారణం స్టార్ హీరోల సినిమాలు కూడా అతి తక్కువ కలెక్షన్లు నమోదు చేసుకుంటూ ఉండడం. డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాన్ని పెట్టి భారీ అంచనాల మధ్య విడుదల చేసిన స్టార్ హీరో సినిమాలు చాలావరకు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.

ఒకవైపు ప్రతి నెల విడుదలవుతున్న స్టార్ హీరో సినిమాలు తక్కువే ఉన్నప్పటికీ విడుదలైన కొన్ని కూడా భారీ డిజాస్టర్లుగా నిలుస్తూ డిస్ట్రిబ్యూటర్లకు తేరుకోలేనటువంటి విధంగా నష్టాలను కలగజేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డిస్ట్రిబ్యూటర్లు కూడా ప్యాన్ ఇండియా సినిమాలకు సైతం రికార్డ్ రేంజ్ ధరలను పెట్టి కొనుగోలు చేయడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు.

ఇంతకుముందు స్టార్ హీరో సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతల ముందు క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు కూడా స్టార్ హీరో సినిమా పై క్రేజ్ అలానే ఉన్నప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు లిమిటెడ్ గా మాత్రమే డీల్స్ మాట్లాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఉదాహరణ కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా సలార్. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి భాగం కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

కరోనా తర్వాత విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ ను నమోదు చేసింది. కానీ సలార్ మాత్రం దానికి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. కరోనా సమయంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా 210 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను నమోదు చేసుకోగా సలార్ సినిమా డిసెంబర్ లో కూడా కేవలం 170 కోట్లకు సినిమా థియేటర్ డీల్స్ ని పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న గుంటూరు కారం విషయంలో కూడా ఇదే జరగబోతోంది. సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమా విషయంలో కూడా డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్టార్ హీరో సినిమాలపై క్రేజ్ మారకపోయినా థియేటర్ డీల్స్ విషయంలో మాత్రం చాలానే మార్పులు వస్తున్నాయి.

Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News