Stock Market Updates: స్టాక్ మార్కెట్లకు లాభాలు ఒక్క రోజుకే పరిమితమయ్యాయి. శుక్రవారం మార్కెట్ సూచీలు (Stocks closing bell) రికార్డు స్థాయిలో కుప్పకూలాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ (BSE Sensex) ఇటీవలి నెలల్లో ఎన్నడూ లేనంతగా 1,688 పాయింట్లు తగ్గి.. 57,107 వద్దకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి-నిఫ్టీ ఏకంగా (NSE Nify) 510 పాయింట్లు కోల్పోయి 17,026 వద్ద స్థిరపడింది.
దేశీయంగా కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పటికి అంతర్జాతీయంగా రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతుండటం వల్ల మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడినట్లు తెలుస్తోంది. దీనికి తోడు కరోనా కొత్త వేరియంట్ కేసుల్లో వృద్ధి ఆందోళనలు పెంచుతున్నాయి. ఈ కారణంగా ఇటీవల నమోదైన లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు.
అన్ని రంగాలు నష్టాలన మూటగట్టుకున్నాయి. బ్యాంకింగ్, లోబహ, ఆటోమొబైల్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఫార్మా రంగంలోని కొన్ని కంపెనీలు మాత్రమే స్వల్పంగా లాభాలను గడించాయి.
ఈ రోజు సెషన్ ఎలా సాగిందంటే..
ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్ 58,254 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 56,993 కనిష్ఠానికి పడిపోయింది.
నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,355 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 16,985 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.
లాభ నష్టాల్లో టాప్-5 షేర్లు..
డాక్టర్ రెడ్డీస్ 3.35 శాతం, నెస్లే 0.35 శాతం లాభాలను గడించాయి. 30 షేర్ల ఇండెక్స్‌లో ఈ రెండు షేర్లు మాత్రమే లాభాలను గడించాయి. మిగతా 28 షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇండస్ ఇండ్ బ్యాంక్ 6.01 శాతం, మారుతీ సుజుకీ 5.27 శాతం, టాటా స్టీల్ 5.23 శాతం, ఎన్టీపీసీ 4.84 శాతం, బజాజ్ ఫినాన్స్ 4.60 శాతం నష్టాలను నమోదు చేశాయి.
ఆసియాలో ఇతర మార్కెట్లు..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. షాంఘై (చైనా), టోక్యో (జపాన్), సియోల్ (దక్షిణ కొరియా), హాంకాంగ్, థైవాన్ సూచీలు కూడా భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి.
కాస్త పెరిగిన రూపాయి..
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 36 పైసలు బలపడింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 74.87 వద్ద కొనసాగుతోంది.
Also read: షియోమీ తొలి ఎలక్ట్రిక్ కారు మార్కెట్‌లో వచ్చేది ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook