Stock Market: స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ జోరు... 60 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో  సెన్సెక్స్‌ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. శుక్రవారం సెన్సెక్స్‌ మార్కెట్ల ప్రారంభ సమయంలో 60,000 మార్క్‌ మైలురాయిని టచ్‌ చేసింది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 24, 2021, 11:17 AM IST
  • సరికొత్త రికార్డు సృష్టించిన స్టాక్ మార్కెట్
  • 60 వేల పాయింట్ల ఎగువన సెన్సెక్స్
  • 18 వేల మార్క్‌కు చేరువలో నిఫ్టీ
Stock Market: స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ జోరు... 60 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో (Stock market today) మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. శుక్రవారం.. సెన్సెక్స్‌(BSE sensex) ఆరంభంలోనే 60 వేల పాయింట్ల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ(NIFTY) కూడా 18000 కీలక మైలురాయి దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అమెరికా మార్కెట్లు(US Stock market news) కూడా చివరి సెషన్​లో భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. దేశీయంగా పలు సానుకూల పరిణామాలు కూడా బుల్‌ రంకెకు కారణమవుతున్నాయి.

 ఈ ఏడాది ఫిబ్రవరిలో సెన్సెక్స్‌ 50వేల మార్క్‌ను క్రాస్‌ చేయగా కేవలం ఆరునెలల్లో మరో 10 వేల పాయింట్లను టచ్‌ చేసి అంతర్జాతీయ మార్కెట్‌లతో పోటీ పడుతున్నాయి. శుక్రవారం ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 375 పాయింట్ల లాభంతో 60,260 వద్ద.. నిఫ్టీ 110 పాయింట్లు లాభపడి 17,933 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.73.78 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈ 30 సూచీలో మెజారిటీ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఏషియన్ పెయింట్స్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, సన్‌ ఫార్మా షేర్లు రాణిస్తున్నాయి. టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌, టైటన్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫినాన్స్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

Also Read: SBI Dussehra Offer: ఎస్‌బీఐ దసరా పండుగ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు ఇవే

సెన్సెక్స్.. 60 వేల ప్రస్థానం

దలాల్​ స్ట్రీట్​(Dalal Street) కొనుగోళ్లతో స్టాక్​మార్కెట్(Stock market news) ​ కళకళలాడుతోంది. ఫలితంగా.. సెన్సెక్స్​ కొత్త రికార్డుల్లో దూసుకెళ్తోంది. దాదాపు 30 ఏళ్ల కిందట 1990లో తొలిసారిగా 1000 మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌.. 10వేల మార్కును అందుకోవడానికి 16ఏళ్లు పట్టింది. కేవలం ఆరు సంవత్సరాల్లో 30వేల నుంచి నేడు 60 వేల మార్క్‌కు చేరింది. 

అయితే ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. హర్షద్‌ మెహతా, కేతన్‌ పరేఖ్‌, సత్యం లాంటి కుంభకోణాలు.. జీఎస్‌టీ అమలు, నోట్ల రద్దు లాంటి ప్రభుత్వ నిర్ణయాలు, కరోనా మహమ్మారి.. ఇలా ఎన్నో ఘటనలు మార్కెట్‌పై(Stock market) తీవ్ర ప్రభావం చూపాయి. అదే సమయంలో మోదీ ప్రభుత్వ సంస్కరణలు, కొవిడ్‌ టీకాలకు ఆమోదం వంటి పరిణామాలు సూచీలను నిలబెట్టాయి. అలా నేడు సెన్సెక్స్‌ 60 వేలకు చేరింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News