SBI FD rates: ఎస్​బీఐ గుడ్​ న్యూస్​- ఫిక్స్​డ్​ డిపాజిట్​ వడ్డీ రేట్లు పెంపు!

SBI FD rates: బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ.. ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. కొత్త వడ్డీ రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2022, 05:08 PM IST
  • ఎస్​బీఐ ఖాతాదారులకు గుడ్​ న్యూస్​
  • రూ.2 కోట్ల లోపు ఎఫ్​డీలపై వడ్డీ రేటు పెంపు
  • తక్షణమే అమలులోకి కొత్త రేట్లు
SBI FD rates: ఎస్​బీఐ గుడ్​ న్యూస్​- ఫిక్స్​డ్​ డిపాజిట్​ వడ్డీ రేట్లు పెంపు!

SBI FD rates: దేశీయ అతిపెద్ద, ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ పండుగ పూట గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు లేదా 0.10 శాతం వరకు పెంచుతున్నట్లు (SBI FD rates Hiked) ప్రకటించిది.

సవరించింది ఈ వడ్డీ రేట్లు రూ.2 కోట్ల లోపు డిపాజిట్లకు వర్తిస్తాయని ఎస్​బీఐ శనివారం ఓ ప్రకటనలో (SBI hikes FD rates) పేర్కొంది. కొత్త వడ్డీ రేట్లు నేటి నుంచే (15 జనవరి 2022) అమలులోకి రానున్నాయని స్పష్టం (SBI new FD rates) చేసింది.

ఎస్​బీఐ కొత్త వడ్డీ రేట్లు (సాధారణ ఖాతాదారులకు) ఇలా..

  • 7 నుంచి 45 రోజుల వ్యవధి ఉన్న ఫిక్స్​డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2.9 శాతంగా ఉంచింది ఎస్​బీఐ.
  • 46 నుంచి 179 రోజుల వ్యవధి ఉన్న ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 3.9 శాతంగా నిర్ణయించింది.
  • 180 నుంచి 210 రోజుల వ్యవధి ఉన్న ఎఫ్​డీలపై వడ్డీ రేటు 4.4 శాతంగా నిర్ణయించినట్లు ఎస్​బీఐ ప్రకటించింది.
  • 211 రోజుల నుంచి ఏడాది లోపు వ్యవధి ఉన్న ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేటును 4.4 వద్ద స్థిరంగా ఉంచింది ఎస్​బీఐ.
  • ఇక ఏడాది నుంచి రెండేళ్ల లోపు వ్యవది గల ఎఫ్​డీలపై వడ్డీ రేటు 5.1 శాతానికి పెంచింది. ఇంతకు ముందు ఇది 5 శాతం వద్ద ఉండేది.
  • రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు వ్యవధి ఉన్న ఎఫ్​డీలపై వడ్డీ రేటును 5.1 శాతంగా ఉంచింది.
  • మూడు నుంచి ఐదేళ్ల లోపు వ్యవధి ఉన్న ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.3 శాతం వద్ద ఉంది.
  • ఐదు నుంచి పదేళ్ల లోపు వ్యవధి ఉన్న ఎఫ్​డీలపై వడ్డీ రేటును 5.4 శాతం వద్ద ఉంచింది ఎస్​బీఐ.

సీనియర్ సిటిజన్లకు ఇలా..

7 నుంచి 45 రోజుల వ్యవధి ఉన్న ఫిక్స్​డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 3.4 శాతంగా ఉంచింది ఎస్​బీఐ. ఇంతకు ముందు కూడా 3.4 శాతం వద్దే ఉండటం గమనార్హం.

  • 46 నుంచి 179 రోజుల వ్యవధి ఉన్న ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 4.4 శాతంగా నిర్ణయించింది.
  • 180 నుంచి 210 రోజుల వ్యవధి ఉన్న ఎఫ్​డీలపై వడ్డీ రేటు 4.9 శాతంగా నిర్ణయించినట్లు ఎస్​బీఐ ప్రకటించింది.
  • 211 రోజుల నుంచి ఏడాది లోపు వ్యవధి ఉన్న ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేటును 4.9 వద్ద స్థిరంగా ఉంచింది ఎస్​బీఐ.
  • ఇక ఏడాది నుంచి రెండేళ్ల లోపు వ్యవధి ఉన్న ఎఫ్​డీలపై వడ్డీ రేటు 5.6 శాతానికి పెంచింది. ఇంతకు ముందు ఇది 5.5 శాతం వద్ద ఉండేది.
  • రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు వ్యవధి ఉన్న ఎఫ్​డీలపై వడ్డీ రేటును 5.8 శాతంగా ఉంచింది.
  • మూడు నుంచి ఐదేళ్ల లోపు వ్యవ్యధి ఉన్న ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.8 శాతం వద్ద, ఐదు నుంచి పదేళ్ల లోపు వ్యవధి గల ఎఫ్​డీలపై వడ్డీ రేటును 6.2 శాతం వద్ద ఉంచింది ఎస్​బీఐ.

Also read: Todays Gold Price: సంక్రాంతి వేళ..దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధరలు

Also read: December WPI Inflation: డిసెంబర్​లో తగ్గిన టోకు ద్రవ్యోల్బణం- తొమ్మిదో నెలా రెండంకెలపైనే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News