SBI personal loan : సులువుగా పర్సనల్ లోన్, నిమిషాల్లో అకౌంట్లో డబ్బు జమ, ప్రాసెసింగ్ ఫీజు లేదు..

SBI personal loan, Zero processing fees : పర్సనల్ లోన్లపై ప్రత్యేక రాయితీలను అందిస్తోంది ఎస్బీఐ. అలాగే ఎంతో స్పీడ్‌గా లోన్లను మంజూరు చేస్తుంది. ఇందుకోసం బ్యాంక్‌కు కూడా వెళ్లకుండా ఆన్లైన్లోనే ప్రాసెస్ మొత్తం పూర్తి చేయొచ్చు. అంతేకాదు లోన్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2021, 04:10 PM IST
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫర్
  • సులువుగా పర్సనల్ లోన్ తీసుకునే అవకాశం
  • బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు
  • ప్రాసెసింగ్ ఫీజు లేదు
SBI personal loan : సులువుగా పర్సనల్ లోన్, నిమిషాల్లో అకౌంట్లో డబ్బు జమ, ప్రాసెసింగ్ ఫీజు లేదు..

SBI customers can avail personal loan on YONO app,Zero processing fees, know interest rate and other details : మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా. మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటునారా..అయితే సులభంగా ఎస్‌బీఐ నుంచి సులువుగా పర్సనల్ లోన్ ఎలా పొందొచ్చో తెలుసుకుందాం. 

పర్సనల్ లోన్లపై (Personal loans) ప్రత్యేక రాయితీలను అందిస్తోంది ఎస్బీఐ. అలాగే ఎంతో స్పీడ్‌గా లోన్లను మంజూరు చేస్తుంది. ఇందుకోసం బ్యాంక్‌కు (Bank‌) కూడా వెళ్లకుండా ఆన్లైన్లోనే ప్రాసెస్ మొత్తం పూర్తి చేయొచ్చు. అంతేకాదు లోన్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు. ప్రీ అప్రూవ్డ్ లోన్ (Pre Approved Loan) సౌకర్యం ద్వారా ఈజీగా రుణాన్ని పొందే వెసులుబాటు కల్పించింది ఎస్‌బీఐ (SBI). ఈ సౌక‌ర్యాన్ని ఎస్‌బీఐ ఖాతాదారులు అన్ని రోజులూ 24 గంట‌లూ వినియోగించుకోవచ్చు. 

లోన్‌ ఎలిజిబులిటీని ఈ విధంగా చెక్ చేసుకోవ‌చ్చు. ఎస్‌బీఐ ఖాతాదారులు PAPL<స్పేస్‌>< చివ‌రి 4 అంకెల ఎస్‌బీఐ సేవింగ్ అకౌంట్ నంబర్>> అని టైప్ చేసి 567676 నంబర్‌‌కు ఎస్‌ఎంఎస్ పంపాలి. దీంతో లోన్ ఎలిజిబులిటీ ఉందో లేదో తెలుస్తుంది. 

Also Read : Viral Video: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న సర్పాల సయ్యాట-ఒకదానికొకటి పెనవేసుకుని...

ఎస్‌బీఐ.. పర్సనల్ లోన్స్‌పై (SBI Personal Loans) క‌నిష్ఠంగా 9.60% వ‌డ్డీరేటు వసూలు చేస్తోంది. ఇక ప్రస్తుతం ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు కూడా లేదు. పండుగ ఆఫ‌ర్ సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 31, 2022 వ‌ర‌కు ప్రాసెసింగ్ ఛార్జీల్లో వందశాతం మిన‌హాయింపు ఇచ్చింది ఎస్‌బీఐ. 

పర్సనల్‌ లోన్‌ ను ఇలా పొందొచ్చు.. 

మొదట ఎస్బీఐ యోనో యాప్‌లోకి (SBI Yono App) లాగిన్ అవ్వాలి. తర్వాత అవైల్ నౌ అనే దానిపై క్లిక్ చేయాలి. లోన్ మొత్తం, కాల‌వ్య‌వ‌ధిని ఎంచుకోవాలి. బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా జస్ట్ నాలుగు క్లిక్‌లతో పర్సనల్ లోన్ (Personal loan) ప్రాసెస్ పూర్తయి పోయి మీ అకౌంట్‌లో అమౌంట్ జమ అవుంది.

Also Read : SBI services down: రేపు ఆ 5 గంటలు ఎస్​బీఐ సేవలకు అంతరాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News