How you can stop SBI Cheque: మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులా, మీరు సంతకం చేసి ఇచ్చిన చెక్‌ను క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారా.. అయితే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ తన ఖాతాదారులకు శుభవార్త అందిచింది. ఈ మధ్య ఖాతాదారులకు సరికొత్త సౌకర్యం కోసం స్టేట్ బ్యాంక్ వెబ్‌సైట్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ అప్‌డేట్ చేసి మరింత వేగంగా సర్వీసులు అందిస్తోంది.
ఖాతాదారులు బ్యాంకుకు వెళ్లకుండానే ఎస్‌బీఐ చెక్‌ను నిలిపివేసే సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఎస్‌బీఐ యోనో లైట్ ద్వారా బ్యాంకును సంప్రదించకుండానే మీకు కోరుకున్న చెక్‌ను నిలిపివేయవచ్చు. ఇందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని భారతీయ స్టేట్ బ్యాంకు (State Bank of India) తెలిపింది. ఎస్‌బీఐ ఖాతాదారులు ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ చెక్కులు సైతం ఆపివేయవచ్చునని స్పష్టం చేసింది. ఇందుకోసం ఖాతాదారుల నుంచి ఛార్జీలు వసూలు చేయడం లేదని ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read: Telangana unlock: నేటి నుంచే తెలంగాణలో అన్‌లాక్.. Corona guidelines తప్పనిసరి
Step 1: ఎస్‌బీఐ యోనో లైట్ (SBI Yono Lite)కు లాగిన్ అవ్వాలి
Step 2: మొదట రిక్వెస్ట్స్ (Requests) ఆప్షన్ మీద క్లిక్ చేయాలి, ఆపై చెక్ బుుక్ (Cheque Book)కు వెళ్లి.. Stop/Revoke Cheque ఆప్షన్ మీద క్లిక్ చేయాలి
Step 3: అక్కడ కనిపించే స్టాప్ చెక్ (Stop Cheque) రేడియో బటన్ సెలక్ట్ చేసుకోవాలి
Step 4: డ్రాప్‌డౌన్ నుంచి మీ బ్యాంక్ ఖాతా నెంబర్ సెలక్ట్ చేయాలి
Step 5: చెక్ నెంబర్ మొదటి అంకెలు (తప్పనిసరి) మరియు చెక్ చివరి అంకెలు నమోదు చేయాలి.
Step 6: ఇన్‌స్ట్రుమెంట్ టైప్ (instrument type) సెలెక్ట్ చేయాలి
Step 7: చెక్ ఎందుకు స్టాప్ చేస్తున్నారో కారణం సెలక్ట్ చేయాలి. ఖాతాదారులు (SBI Cash Withdrawal Rules) కచ్చితంగా ఈ విషయాలు సమర్పించాలి.
Step 8: టర్మ్స్ అండ్ కండీషన్స్ (Terms and Conditions) అంగీకరించాలి
Step 9: ఆ తరువాత సబ్మిట్ (Submit) చేయాలి.
Step 10: మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేస్తే మీరు కోరుకున్న చెక్ స్టాప్ (నిలుపుదల) అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook