SBI ATM New Rules: ఎస్బీఐ ఎటీఎంలలో కొత్త నిబంధన, డబ్బులు తీయాలంటే ఓటీపీ తప్పనిసరి

SBI New Rules: ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసే సమయంలో జరిగే మోసాల్నించి కస్టమర్లను రక్షించేందుకు ఎస్బీఐ సరికొత్త విధానం ప్రవేశపెట్టింది. ఏటీఎం నుంచి క్యాష్ తీసుకోవాలంటే కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 11, 2022, 12:34 PM IST
  • ఏటీఎంల వద్ద జరిగే మోసాలకు ఇక చెక్
  • ఓటీపీ ఆధారిత ఏటీఎం లావాదేవీల్ని ప్రవేశపెట్టిన ఎస్బీఐ
  • పదివేల కంటే ఎక్కువ నగదు తీయాలంటే..ఓటీపీ తప్పనిసరి
SBI ATM New Rules: ఎస్బీఐ ఎటీఎంలలో కొత్త నిబంధన, డబ్బులు తీయాలంటే ఓటీపీ తప్పనిసరి

SBI ATM New Rules for Cash Withdrawals: ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసే సమయంలో జరిగే మోసాల్నించి కస్టమర్లను రక్షించేందుకు ఎస్బీఐ సరికొత్త విధానం ప్రవేశపెట్టింది. ఏటీఎం నుంచి క్యాష్ తీసుకోవాలంటే కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది.

ఏటీఎం మెషీన్లు, ఆన్‌లైన్ మోసాలపై ఎస్బీఐ తన కస్టమర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. ఇప్పుడు ఏటీఎం వద్ద జరిగే మోసాల్ని అరికట్టేందుకు కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. పాత పద్దతిని మార్చేసింది. ఇప్పుడిక ఎస్బీఐ ఏటీఎంల నుంచి క్యాష్ తీయాలంటే..మొబైల్ ఫోన్‌కు ఓ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే నగదు బయటకు వస్తుంది. 

ఎస్బీఐ కస్టమర్లకు అత్యవసరమైన సమాచారమిది. బ్యాంక్ తన కస్టమర్లకు ఏటీఎం మోసాల్నించి కాపాడేందుకు ఓ ప్రత్యేక సౌకర్యం కల్పించింది. ఎస్బీఐ ఏటీఎం నిబంధనలు మార్చేసింది. ఏటీఎం లావాదేవీల్ని మరింత సురక్షితం చేసే చర్యలు చేపట్టింది. ఇప్పుడిక ఎస్బీఐ ఏటీఎం నుంచి క్యాష్ తీయాలంటే ఓటీపీ కచ్చితంగా ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేయకుండా ఏటీఎం నుంచి క్యాష్ బయటకు రాదు. ఇందులో క్యాష్ తీసేటప్పుడు మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేస్తేనే క్యాష్ బయటకు వస్తుంది.

ఏటీఎంల వద్ద జరిగే మోసాలకు ఈ కొత్త విధానంతో చెక్ పెట్టవచ్చని అంటోంది ఎస్బీఐ. కస్టమర్లను మోసాల్నించి కాపాడటమే బ్యాంకు ముఖ్య ఉద్దేశ్యమని ఎస్బీఐ తెలిపింది. ఓటీపీ ఆధారిత క్యాష్ విత్‌డ్రాయల్ ఎలా పనిచేస్తుందనేది కూడా ఎస్బీఐ వివరించింది. పదివేల కంటే ఎక్కువ నగదు తీయాలంటే ఓటీపీ విధానం అమలవుతుంది. రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీను  ఎంటర్ చేసిన తరువాతే మీరు విత్‌డ్రా చేసే డబ్బులు చేతికి వస్తాయి. ఈ ఓటీపీ నాలుగంకెల్లో ఉంటుంది. ఇది కేవలం సింగిల్ లావాదేవీకు మాత్రమే వర్తిస్తుంది. 

Also read: Hyundai Offers: కొత్త కారు కొనాలనుకుంటున్నారా..హ్యుండయ్ నుంచి భారీ డిస్కౌంట్లు ఈనెలలోనే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook  

Trending News