EPFO Interest Credit: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. మీ ఖాతాను చెక్ చేసుకోండి

EPFO Interest Rate: ఎప్పుడు వడ్డీ జమ చేస్తారని ఓ నెటిజన్ ట్విట్టర్‌లో ప్రశ్నించగా.. ఈపీఎఫ్ఓ సమాధానం ఇచ్చింది. వడ్డీ జమ చేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపింది. త్వరలోనే ఖాతాదారులకు జమ అవుతుందని వెల్లడించింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2022, 02:09 PM IST
EPFO Interest Credit: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. మీ ఖాతాను చెక్ చేసుకోండి

EPFO Interest Rate: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) గుడ్ న్యూస్ తెలిపింది. 2021-22 ఏడాదికి వడ్డీని జమ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించింది. క్రెడిట్ చేసిన వడ్డీ త్వరలో లబ్ధిదారుల యూఏఎన్ లేదా ఈపీఎఫ్ ఖాతాలలో చూపిస్తుందని పేర్కొంది.

ఎప్పుడు వడ్డీ జమ చేస్తారని ఓ నెటిజన్ ట్విట్టర్‌లో ప్రశ్నించగా.. వడ్డీ జమ చేసే ప్రక్రియ ప్రారంభమైందని.. త్వరలోనే మీ అకౌంట్స్‌లో చూపిస్తుందని సమాధానం ఇచ్చింది. వడ్డీని ఎప్పుడు జమ చేసినా.. పూర్తిగా చెల్లిస్తామని తెలిపింది. మీ వడ్డీకి ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేసింది. రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ EPFO ​​ద్వారా సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేయడం వల్ల వడ్డీని జమ చేయడంలో ఆలస్యం జరిగింది. 

 

మార్చి 31తో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరానికి 5 కోట్ల మంది ఖాతాదారులకు ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.1 శాతం వడ్డీని జమ చేసేందుకు ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే. 

ఇలా చెక్ చేసుకోండి..

ఈపీఎఫ్ ఖాతాదారులను ఒకే ప్లాట్‌ఫారమ్‌లో వివిధ రకాల ప్రభుత్వ సేవలను ఉమాంగ్ యాప్ ద్వారా అందిస్తుంది. ఖాతాదారులు వారి ఈపీఎఫ్‌ పాస్‌బుక్‌ని చూడటానికి.. క్లెయిమ్‌లను సమర్పించడానికి, వారి క్లెయిమ్‌లను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఉమంగ్ యాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ముందుగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. 

మీ ఫోన్ నంబర్‌ను నమోదు చేసి, వన్-టైమ్ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయడం ద్వారా ఉమాంగ్ సేవలను పొందవచ్చు. పాస్‌బుక్‌లో మీ ఖాతాలో జమ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఈపీఎఫ్‌ఓ ​​వెబ్‌సైట్‌లో ‘మెంబర్ పాస్‌బుక్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ యూఏఎన్ నంబరు, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ చేయడం ద్వారా PF పాస్‌బుక్‌లో చెక్ చేసుకోవచ్చు.  

ఈపీఎఫ్‌ఓ ఖాతాదారుల వడ్డీ రేటులో ఎలాంటి నష్టం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ నిర్వహించడం వల్ల గత ఆర్థిక సంవత్సరానికి వడ్డీని జమ చేయడంలో జాప్యం జరిగిందని తెలిపింది.  

Also Read: Team India: ఈ టీమిండియా ఆటగాడికి లక్కీ ఛాన్స్.. ఒకేసారి మూడు టీమ్స్‌లో చోటు

Also Read: KTR TRAGET RAHUL: కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ వార్.. ఓ రేంజ్ లో తిట్టుకున్నారుగా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News