Credit Card Payments: క్రెడిట్ కార్డు హోల్డర్లకు గమనిక, ఇకపై ఫోన్‌పే వంటి యాప్స్ ద్వారా చెల్లింపులు చేయలేరు

Credit Card Payments: క్రెడిట్ కార్డు చెల్లింపు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై మీరు క్రెడిట్ కార్డు చెల్లింపుల్ని ఫోన్‌పే, అమెజాన్ పే, పేటీఎం, క్రెడ్ ద్వారా చెల్లించలేరు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 4, 2024, 11:28 AM IST
Credit Card Payments: క్రెడిట్ కార్డు హోల్డర్లకు గమనిక, ఇకపై ఫోన్‌పే వంటి యాప్స్ ద్వారా చెల్లింపులు చేయలేరు

Credit Card Payments: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు చెల్లింపుల విషయంలో కొత్త మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇకపై క్రెడిట్ కార్డు బిల్లుల్ని కేవలం భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అదెలాగో తెలుసుకుందాం.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇంకా ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డు హోల్డర్లు ఇప్పటి వరకూ తమ బిల్లుల్ని ధర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయినా ఫోన్‌పే, క్రెడ్, అమెజాన్ పే,పేటీఎం ద్వారా చెల్లిస్తూ వచ్చారు. ఇకపై అలా సాధ్యం కాదు. ఇకపై భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌ను ఆర్బీఐ అభివృద్ధి చేసింది. వ్యాపార లావాదేవీల్లో చెల్లింపు వ్యవస్థను మరింత సరళీకృతం చేసేందుకు ఈ విధానం తీసుకొచ్చింది. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ఇతర బ్యాంకులకు కొత్తగా ఈ సిస్టమ్ అవసరం లేదు. ఇప్పటికే ఈ బ్యాంకులు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ కలిగి ఉన్నాయి. జూలై 1 నాటికి బారత్ బిల్ పేమెంట్ వ్యవస్థతో అనుసంధానమైన బ్యాంకుల జాబితా ఇలా ఉంది. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్ర బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకు, ఏయూ స్మాల్ ఫైనాన్స్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సరస్వత్ బ్యాంక్.

యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐడీఎఫ్‌సి బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్‌లు త్వరలో భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌తో సమీకృతం కావల్సి ఉంది. అందుకే క్రెడిట్ కార్టు హోల్డర్లు తాము దేన్నించి చెల్లింపు చేస్తున్నారో ఆ సంస్థ లేదా బ్యాంక్..భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థతో అనుసంధానమైందో లేదో తెలుసుకోవల్సి ఉంటుంది. ఈ సమాచారం సంబంధిత బ్యాంక్ వెబ్‌సై‌ట్‌పై ఉంటుంది. 

Also read: RBI Orders: ఆ ఎక్కౌంట్లు క్లోజ్ చేయాల్సిందిగా ఆర్బీఐ ఆదేశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News