Bank Locker Rules: లాకర్లలో ఆభరణాలు వస్తువులు పోతే బ్యాంకు బాధ్యత వహించదా, ఆర్బీఐ రూల్స్ ఎలా ఉన్నాయి.

Bank Locker Rules: బ్యాంకు లాకర్ల గురించి అందరికీ తెలిసిందే. ఆభరణాలు, డాక్యుమెంట్లు, విలువైన వస్తువుల్ని ఈ లాకర్లలోనే దాచుకుంటుంటారు. ఇంట్లో రక్షణ లేదని భావించినప్పుడు లాకర్లలో దాచుకోవడం అలవాటు. అయితే బ్యాంకు లాకర్లకు సంబంధించి కీలకమైన వివరాలు మీ కోసం...  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 9, 2024, 11:41 AM IST
Bank Locker Rules: లాకర్లలో ఆభరణాలు వస్తువులు పోతే బ్యాంకు బాధ్యత వహించదా, ఆర్బీఐ రూల్స్ ఎలా ఉన్నాయి.

Bank Locker Rules: దేశవ్యాప్తంగా దాదాపు అన్ని బ్యాంకులు లాకర్ సౌకర్యం కల్పిస్తుంటాయి. లాకర్లలో చాలా రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. డబ్బులు దాచుకోవచ్చు. బంగారు ఆభరణాలు దాచుకోవచ్చు. విలువైన డాక్యుమెంట్లు ఉంచుకోవచ్చు. అయితే బ్యాంకు లాకర్లలో మీరు దాచుకున్నవి దొంగతనానికి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారో తెలుసా, బ్యాంకు బాధ్యత వహిస్తుందా లేదా..ఈ వివరాలు మీ కోసం..

కస్టమర్ల విలువైన వస్తువుల రక్షణకు ఉద్దేశించిందే బ్యాంక్ లాకర్లు. లాకర్లకు ఏడాదికి అద్దె వసూలు చేస్తుంటాయి బ్యాంకులు. బ్యాంకు లాకర్లంటే అత్యంత భద్రత కలిగినవిగా భావిస్తారు. కానీ ఒక్కోసారి బ్యాంకు లాకర్లలో దాచుకున్న వస్తువులు కూడా పోతుంటాయి. అలాంటి సంఘటనలున్నాయి. ఈ పరిస్థితుల్లో బాధ్యత ఎవరిదనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది. బ్యాంకు లాకర్లలో దాచుకున్నది పోతే కొన్ని కేసుల్లో అయితే బాధ్యత ఎవరికీ ఉండదు. కొన్ని కేసుల్లో మాత్రం మొత్తం బాధ్యత బ్యాంకుదే అవుతుంది. ఇదంతా బ్యాంకు లాకర్ తీసుకునేటప్పుడు కుదుర్చుకునే ఒప్పందం బట్టి ఉంటుంది. అందుకే లాకర్ అగ్రిమెంట్ ఒప్పందాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలి. 

బ్యాంకులు లాకర్లను అద్దెకు ఇస్తుంటాయి. లాకర్‌లో దాచుకునే వస్తువులు పోతే బ్యాంకుకు బాధ్యత ఉండదు. బ్యాంకు అగ్రిమెంట్ కూడా బ్యాంకుకు అనుకూలంగానే ఉంటుంది. ఏదైనా జరగానికి జరిగి ప్రకృతి విపత్తు అంటే వరదలు, అగ్ని ప్రమాదం, భూకంపం, వర్షాలు, పిడుగు, తిరుగుబాటు, యుద్ధం,అల్లర్లు వంటివాటి కారణంగా లాకర్లకు ప్రమాదం ఎదురైతే  బ్యాంకు బాధ్యత వహించదని లాకర్ అగ్రిమెంట్‌లో స్పష్టంగా రాసి ఉంటుంది. బ్యాంకులు కల్పించే లాకర్ సౌకర్యానికి అద్దె తీసుకుంటారు. లాకర్ సెక్యూరిటీ కోసమని చెప్పినా అందులో దాచుకున్నవాటికి తమ బాధ్యత లేదంటాయి బ్యాంకులు. అయితే జనవరి 2022 నుంచి ఆర్బీఐ బ్యాంకు లాకర్ నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం లాకర్‌లో దాచుకున్న వాటికి తమ బాధ్యత ఉండదని బ్యాంకులు చెప్పజాలవు.

ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం ఏదైనా దొంగతనం, మోసం, అగ్ని ప్రమాదం, భవనం కూలిపోవడం జరిగితే ఏడాది లాకర్ అద్దెకు వంద రెట్ల వరకూ బ్యాంకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా లాకర్ సెక్యూరిటీ విషయంలో బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. లాకర్ ఎప్పుుడు తెరిచినా సంబంధిత కస్టమర్ కు మెయిల్ లేదా మెస్సేజ్ ద్వారా అలర్ట్ వెళ్లాలి. ఈ నిబంధనలు అమలు చేయని బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటుంది ఆర్బీఐ.

Also read: ONGC Crude Oil: దశాబ్దాల నిరీక్షణకు తెర, కేజీ బేసిన్‌లో భారీగా క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు, ఉత్పత్తి ప్రారంభం

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News