Business Ideas Without Investment: ఇంట్లో ఉండే చేసుకునే లాభదాయకమైన వ్యాపారాలు

Profitable Business Ideas With Less Investment: సొంతంగా ఏదైనా బిజినెస్ చేయాలి, జీవితంలో పైకి ఎదగాలి, లగ్జరీ ఇల్లు కొనాలి, లగ్జరీ కారు కొనాలి.. హమ్ కిసీసే కమ్ నహీ అనిపించుకోవాలి.. తగ్గెదెలె అనే కోరికలు చాలామందిలో ఉంటాయి. కానీ చాలామందికి ఎదురయ్యే ఏకైక సమస్య పెట్టుబడి. మరి పెట్టుబడి లేకుండానో లేక ఎక్కువ పెట్టుబడి లేకుండానే వ్యాపారం మొదలుపెట్టగలిగే అవకాశం ఉంటేనో ఎలా ఉంటుంది. కతర్నాక్ ఉంటుంది కదా.. అలాంటి ఐడియాస్ ఇదిగో మీ కోసం.

Written by - Pavan | Last Updated : Aug 3, 2023, 06:35 PM IST
Business Ideas Without Investment: ఇంట్లో ఉండే చేసుకునే లాభదాయకమైన వ్యాపారాలు

Profitable Business Ideas With Less Investment: బిజినెస్ చేయాలి అనే కోరిక చాలామందిలో ఉంటుంది ? చేస్తోన్న ఉద్యోగం సంతృప్తిని ఇవ్వకపోవడమో లేక ఆ ఉద్యోగంతో వచ్చే శాలరీ అవసరాలు, ఖర్చులకు సరిపోకపోవడం వల్లనో చాలామంది వ్యాపారం వైపు మొగ్గు చూపిస్తుంటారు. ఇంకొంతమంది స్వతహాగానే వ్యాపారంలో రాణించాలనే కోరికతో ఏదో ఒక బిజినెస్ మొదలుపెట్టాలి అనుకుంటారు. ఇలా కారణాలు ఏవైనా బిజినెస్ చేయాలి అనే కోరిక మాత్రం చాలామందిలో ఉంటుంది. కానీ చాలామంది వెనుక్కు లాగిపెట్టేది పెట్టుబడి సమస్యే. జీవితంలో ఏదైనా చేయాలి, ఏదైనా సాధించాలి అనే కసి చాలామందికి బలంగా ఉంటుంది కానీ వారిలో చాలామందికి పెట్టుబడి సమస్య కావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ తక్కువ పెట్టుబడితోనూ వ్యాపారం చేసేందుకు మార్గాలు ఉన్నాయి అని తెలిస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పండి. ఏంటి మీకు ఇలాంటి ఐడియాలు లేవా ? అయితే, ఇదిగో తక్కువ పెట్టుబడితో చేసే బిజినెస్ ఐడియాస్ మీ కోసం. 

ఇంట్లోనే బేకరీ ఉత్పత్తులు చేయడం : 
మీకు బేకింగ్ తెలిసి ఉంటే నేరుగా మీ ఇంట్లోనే బేకరీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. లేదంటే బేకింగ్ స్కిల్స్ తెలిసిన వారి వద్ద నేర్చుకోవచ్చు. ఇంట్లోనే స్టార్ట్ చేసి మీ ప్రాంతంతో పాటు మీ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉండే బేకరీలకు, దుకాణాలకు సప్లై చేసి మంచి లాభాలు గడించవచ్చు.

మేకప్ ఆర్టిస్ట్ :
ఎల్లప్పుడూ డిమాండ్ ఉండే చిన్న చిన్న వ్యాపారాల్లో బ్యూటీపార్లర్ కూడా ఒకటి. ఖర్చు తక్కువ... లాభాలు ఎక్కువ. పైగా అవసరమైతే మీ ఇంట్లోనే చిన్న సెటప్ ఏర్పాటు చేసుకుని బ్యూటీ పార్లర్ ప్రారంభించవచ్చు. బ్యూటీపార్లర్ నడిపే వారికి అందుకు ఉపయోగించే కాస్మెటిక్ ప్రోడక్ట్స్ సైతం హోల్ సేల్ గా తక్కువ ధరలోనే లభిస్తాయి.

జువెలరీ రెంటల్ బిజినెస్ :
లేడీస్ ఒక్కో ఈవెంట్ కి ఒక్కో తరహాలో రెడీ అవడానికి ఇష్టపడుతున్న రోజులు ఇవి. ఈరోజు ధరించిన జువెలరీ రేపు ధరించడానికి ఇష్టపడటం లేదు. ఏ రోజుకు ఆ రోజు కొత్త జువెలరీ కావాలంటే అవి కొనడం అంత ఈజీ విషయం కాదు కదా.. అందుకే వాటిని కూడా రెంట్ కి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆ వ్యాపారం ఏదో మీరే ప్రారంభిస్తే సరి. అలాగని అంత గోల్డ్ మనకు ఎక్కడిది అనుకోవద్దు. జువెలరీ రెంటల్ బిజినెస్ లో ఉపయోగించేవి అన్నీ గోల్డ్ తరహాలో కనిపించే కృత్రిమ నగలే. 

వెబ్‌సైట్ డిజైన్ :
ఇప్పుడు ప్రపంచం అంతా ఆన్ లైన్ మయమైపోయింది. పెద్ద ఎత్తున ఏ వ్యాపారం చేసే సంస్థలకు కచ్చితంగా ఒక వెబ్ సైట్ తప్పనిసరి అయింది. అందుకే వెబ్ సైట్ డిజైనింగ్ తెలిసిన వారికి మంచి డిమాండ్ ఉంటుంది. ఇది పెద్దగా పెట్టుబడి లేకుండా మీరే ఒక వెబ్ సైట్ చేసుకుని వ్యాపారం స్టార్ట్ చేయవచ్చు. వెబ్ సైట్ డిజైనింగ్ కూడా మీ చేతుల్లో పనే కనుక పెట్టుబడితో పని లేనే లేదు. డబ్బులు అవసరమైన ప్రతీ సారి మీరే అడ్వాన్స్ రూపంలో క్లయింట్స్ నుంచి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. 

సోషల్ మీడియా ఏజెన్సీ :
ఆన్ లైన్ మార్కెటింగ్, బ్రాండ్ బిల్డింగ్, ప్రోడక్ట్స్ ప్రమోషన్ వంటి అంశాలపై పట్టు ఉండి, సోషల్ మీడియా నాలెడ్జ్ ఉంటే.. మీరే సొంతంగా సోషల్ మీడియా ఏజెన్సీ ప్రారంభించవచ్చు. క్లయింట్స్ పెరిగే కొద్దీ మీ వ్యాపారం పెరిగినట్టే కదా.

ఆర్గనైజింగ్ పార్టీస్ : 
కాస్మోపాలిటన్ కల్చర్ పెరిగిపోయాకా వీకెండ్ వస్తే చాలు ఎక్కడికి వెళ్దాం.. ఎలా పార్టీ చేసుకుందాం అనుకునే వారి సంఖ్య ఎక్కువే అయిపోయింది. అలా సరదా సమయం కోసం వెదుక్కునే వాళ్లంతా పార్టీస్ ఆర్గనైజింగ్ బిజినెస్ చేసే వారికి కస్టమర్స్ అన్నమాట. కొంచెం క్రియేటివ్ మైండ్, కొత్తగా ఆలోచించే శక్తి ఉంటే చాలు.. తక్కువ పెట్టుబడితో పార్టీ ప్లానింగ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ రంగంలో కూడా క్లయింట్స్ వద్ద ముందే మ్యాగ్జిమం అడ్వాన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది.

ఇది కూడా చదవండి : How to Check CIBIL Score: ఇక మీ సిబిల్ స్కోర్‌ని మీరే చెక్ చేసుకోండి

యూట్యూబ్ ఛానెల్ : 
మీరే సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి అందులో క్రియేటివ్ వీడియోలు పోస్ట్ చేయడం ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. లేదంటే మీకు తెలిసిన విద్యను యూట్యూబ్ వీడియోల ద్వారా నలుగిరికి పంచుతూ కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఉదాహరణకు కుకింగ్ వీడియోలు, ఆన్ లైన్ ట్యుటోరియల్స్, ఆన్‌లైన్ కోర్సులు, నచ్చిన, చూసిన ప్రదేశాలు, సినిమాలపై రివ్యూలు వంటివి కూడా అలాంటివే. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యూట్యూబర్స్ ఇలాగే భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు

ఇది కూడా చదవండి : How To Get Credit Cards: ఎక్కువ లిమిట్‌తో క్రెడిట్ కార్డు ఈజీగా అప్రూవ్ కావాలంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News